థమన్ తోక కత్తిరించిన మహేశ్ బాబు.. “గుంటూరు కారం” నుండి అవుట్..!!

సినీ ఇండస్ట్రీలో వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని టీజర్ లు కూడా విడుదలై సినిమాపై అంచనాలని పెంచేస్తున్నాయి. అందులో ఒకటి గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ఫొటోస్, టీజర్ మరింత హైప్ ని క్రియేట్ చేసాయి. మహేష్ బాబు సిగరెట్ పట్టుకొని నడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

S Thaman starts composing music for Mahesh Babu's 'Sarkaru Vaari Paata' |  Telugu Movie News - Times of India

సమ్మర్ కావడంతో షూటింగ్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి వరల్డ్ టూర్ వెళ్ళాడు. టీజర్ కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ట్ మహేష్ బాబుకి, థమన్ కి మధ్య పెద్ద గొడవైందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎందుకు, అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Guntur Karam: Mahesh Babu is highly inflammable | cinejosh.com

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను నాన్ స్టాప్ గా జులై నుండి షెడ్యూల్స్ ని ప్లాన్ చేసాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ప్రారంభం అయ్యే షెడ్యూల్ లో మహేష్ మరియు శ్రీలీల మీద ఒక పాట చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసారు. అయితే షూటింగ్ కి అంతా సిద్దమైన థమన్ ట్యూన్ ఇవ్వడం లేట్ అయ్యింది. ఫైనల్ ట్యూన్ చేసి మహేష్ బాబుకి పంపించగా ఆ ట్యూన్ మహేష్ బాబుకి నచ్చలేదు. ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్ తో మాట్లాడి ఈ సినిమా నుంచి థమన్ ని తొలగించాలని ఒత్తిడి చేసారంట. అయితే త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబుకి ఎదో విధంగా సర్ది చెప్పుకుంటూ వచ్చారు.

Mahesh Babu and Trivikram Srinivas' SSMB28 gets ₹81 cr Netflix deal -  Hindustan Times

థమన్ ట్యూన్స్ ఆలస్యంగా ఇవ్వడమే కాకుండా క్వాలిటీ కూడా లేకపోవడంతో మహేష్ బాబు వెళ్లి త్రివిక్రమ్ మరియు థమన్ ఇద్దరి పై ఫైర్ అయ్యారంటే. వెంటనే ఈ సినిమా నుంచి థమన్ ని తొలగించాలని చెప్పారంట. త్రివిక్రమ్ ఏమి చేయలేక ఈ సినిమా నుంచి థమన్ ని తప్పించారు. అయితే థమన్ హర్ట్ అవ్వకుండా త్రివిక్రమ్ త్వరలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నామని, ఈ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందించబోతున్నాడని ఒక అధికారిక ప్రకటన కూడా చేసి థమన్ ని కూల్ చేసారని తెలుస్తుంది.

Mahesh Babu is in 'work and chill' mode, shares pic from productive day  with Trivikram Srinivas - India Today

కానీ థమన్ మాత్రం సోషల్ మీడియాలో మహేష్ బాబుపై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పేరుని ప్రస్తావించకుండా, పరోక్షంగా ఆయన పై సెటైర్ల మీద సెటైర్లు వేసాడు. సోషల్ మీడియాలో అందరూ థమన్ ప్రవర్తన చూసి చాలా షాక్ కి గురయ్యారు. థమన్ ని తప్పించక ఈ సినిమాకి ఇంకా ఎవ్వరిని ఫైనల్ చేయలేదు. ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.