మిల్కీ బ్యూటీ తమన్నా – బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా వయసు ఇప్పటికే మూడున్నర పదులకు చేరువయ్యింది. తెలుగులో ఎప్పటికీ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారింది. తమన్నా సినిమాల్లో నటిస్తున్నంతకాలం ఆమె చుట్టూ పెద్దగా రూమర్లు అయితే రాలేదు.
అయితే ఇప్పుడు వయసు ముదురుతూ ఉండడంతో ఆమె కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్టే తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ వర్మతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తుంది. రెండు మూడు నెలల క్రితం వరకు ఇదంతా పుకారు అన్న సందేహం కూడా కలిగింది. అయితే ఇప్పుడు తమన్నా బరితెగించేసింది. ప్రియుడు విజయ్ వర్మతో కలిసి చట్టపట్టలేసుకొని తిరుగుతోంది. ముంబైలో క్లబ్బులు, పబ్బులు, పార్టీలకు వెళుతుంది.
తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలో ఓ ప్రముఖ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లారు. డిన్నర్ పూర్తయిన తర్వాత ప్రియుడు విజయ్.. తమన్నాను తన కారులో ఎక్కించుకొని స్వయంగా తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ టైంలో కొందరు మీడియా వాళ్ళు క్లిక్ మనిపించడంతో ఈ సీక్రెట్ ఫోటో బయటకు వచ్చేసింది. ఇక గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరి ఎఫైర్ గుట్టు న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా బయటపడింది.
తమన్న – విజయ్‌కు ఏకంగా మూతి ముద్దు కూడా ఇచ్చింది. ఈ ఫోటో కూడా బయటకు వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అయితే తమన్నా తల్లిదండ్రులకు మాత్రం వీరిద్దరి ప్రేమ, పెళ్లి వ్యవహారం అస్సలు ఇష్టం లేదని.. తమన్నాకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. తమన్నా మాత్రం తల్లిదండ్రులను ఎదిరించి మరి విజయ్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది.