చచ్చిన అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోను.. సుధీర్ అంత మాట అనేసాడు ఏంట్రా బాబు..?

సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి – సురేఖ, వెంకటేష్ – నీరజ , అక్కినేని నాగార్జున – అమల జంటలు ఎలాగో యూట్యూబ్లో సుధీర్ – రష్మీ జంట అలాగా . వీళ్ళ మధ్య పెళ్లి ఒక్కటే కాలేదు మిగతావన్నీ జరిగిపోయాయి అంటూ కూడా ప్రచారం జరిగింది . అంతలా వీళ్ళు షోలలో టిఆర్పిల కోసం హంగామా చేశారు . అది మాత్రం వాస్తవమని అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా జబర్దస్త్ . ఢీ, ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీలలో సుధీర్ – రష్మీ బిహేవ్ చేసిన పద్ధతి అప్పట్లో ఎంతలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

sudheer rashmi❤️❤️ (@Vaishu328836204) / Twitter

ఇప్పుడంటే సుధీర్ బుల్లితెరపై మెరవడం మానేశాడు కానీ అప్పట్లో వీళ్ళు ఇద్దరిని బేస్ చేసుకుని కొత్తగా ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయాలి అనుకున్నారు బుల్లితెర మేకర్స్. అంతలా ఈ జంట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాదు ఇప్పటికీ ఈ జంటను యూట్యూబ్ కపుల్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . సుధీర్ -క్రష్మి ఫ్యాన్స్ . అయితే అప్పట్లో వీళ్ళ మధ్య వచ్చిన స్కిట్స్ అందరికీ తెగ నచ్చేసాయి . అంతేకాదు వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుండడంతో ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు ..

Jabardasth comedian Auto Ram prasad clartiy about Sudigali Sudheer Rashmi  love track | Sudheer Rashmi: సుధీర్, రష్మీ లవ్ ట్రాక్.. ప్రతీ షోలో ఎవరు  చేయిస్తారో తెలుసా?– News18 Telugu

సీన్ కట్ చేస్తే ఇప్పుడు సుధీర్ – రష్మీ మధ్య ఏమీ లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ మధ్యకాలంలో సుధీర్ – రష్మి కలిసి కనిపించిన సందర్భాలు లేవు. అంతేనా సుధీర్ త్వరలోనే తన మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే సుధీర్ – రష్మీ కామన్ ఫ్రెండ్స్ వెళ్లి సుధీర్ ని ప్రశ్నించగా మా మధ్య అలాంటిది ఏదీ లేదు అని..

Dance Video - Sudheer Rashmi Dance Performance - Kulfy

రష్మి తనకు ఫ్రెండే అని .. అలాంటి ఫ్రెండ్ ని చచ్చినా పెళ్లి చేసుకోను అని ..నా దృష్టిలో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్.. లవర్ అంటే లవర్ ..అంతే అంటూ ఓపెన్ గా చెప్పేసారట . ఈ క్రమంలోనే రష్మి మనసులో సుధీర్ ఉన్నాడో లేడో తెలియదు కానీ ..సుధీర్ మనసులో మాత్రం రష్మి అలాంటి స్థానంలో లేదు అని క్లియర్గా అర్థం అయిపోయింది . ప్రజెంట్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్..!!