తన అభినయంతో కొన్నాళ్ల పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అగ్రతార.. ఒకప్పటి వెండి తెర వేల్పు జమునారాణి. మిస్సమ్మ నుంచి మూగమనుసులు సినిమా వరకు అనేక పాత్రలు పోషించిన జమున.. జీవితాంతం.. వెండితెరపై తనదైన శైలిని ప్రదర్శించారు. మధ్యలో రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ఇటు సినిమాలైనా.. అటు రాజకీయం అయినా.. తనకు ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు..
సరే.. ఈ విషయాలు ఎలా ఉన్నా.. సినీరంగంలో అగ్రతారలుగా పేరున్న అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లతో జమున పోటీ పడి నటించేవారు. అనేక సినిమాల్లో సావిత్రితోనూ నటించారు. ఎవరితో నటించినా.. జమున పాత్రలకు ఉండే స్పెషల్ వేరేగా ఉండేది. ఇతర ఏ నటులకు కూడా ఇలాంటి పేరు ఉండేది కాదు. నటనకు నటన.. అందానికి అందం.. అదే సమయంలో పొగరుకు పొగరు కూడా.. జమున సొంతం అనేవారు.
జమున నట జీవితంలో రెండు పాత్రలు.. ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఒకటి మూగమనుసులు సినిమాలో అమాయకంగా నటించే పాత్ర. రెండు శ్రీకృష్ణ తులాభారం సినిమాలో సత్యభామ పాత్రలు కీలకం. ఈ రెండు పాత్రలు కూడా.. చిత్రంగా ఉంటాయి. అగ్రనటులు అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన మూగమనసులులో ఆయనకు మరదలి పాత్ర ఇది. ఈ పాత్ర ఒకసందర్భంలో అక్కినేని గుండెలపై తంతుంది.
అదేవిధంగా శ్రీకృష్ణతులాభారం సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర నటించగా.. జమున సత్యభామ పాత్ర వేశారు. సత్యభామ కూడా. ఒక సీన్‌లో కృష్ణుడి గుండెలపై తంతుంది. ఈ రెండు పాత్రలు చేయడానికి ముందు.. జమున ఒప్పుకోలేదు. కానీ, తర్వాత.. దర్శకులు నచ్చజెప్పడంతో ఆమె నటించారు. ఈ రెండు సీన్లను అద్భుతంగా పండించారు.