మాయా బ‌జార్ సినిమా సూప‌ర్ హిట్ అయినా.. కానీ, సావిత్రికి మాత్రం తీరని అన్యాయం జ‌రిగింది..అది ఇదే..!!

ఇదో చిత్ర‌మైన విష‌యం. చ‌ల‌న చిత్ర‌రంగాన్ని ఒక ద‌శ‌కు తీసుకువెళ్లిన ఘ‌న‌మైన చిత్రంగా ఇప్ప‌టికీ గుర్తుడిపోయిన సినిమా మాయా బ‌జార్‌. కేవీరెడ్డి ప్రాణం పెట్టి తీశారు. ఈ సినిమాలో అన్న‌గారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర‌ను ధ‌రించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్జునుడిగా , సావిత్రి, గుమ్మ‌డి వంటి అతిర‌థులు ఎంద‌రో న‌టించారు. ఇక‌, ఎస్వీ రంగారావు తొలిసారి.. పౌరాణికం న‌టించిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయ‌న ఘ‌టోత్కచుడి పాత్ర‌ను పోషిస్తే.. సూర్యాకాంతం.. వ‌య‌సులో 5 ఏళ్లు చిన్న‌వారే అయినా.. ఎస్వీ రంగారావుకు త‌ల్లిపాత్ర పోషించారు.

సినిమా అంతా కూడా.. సుభ‌ద్ర పాత్ర‌ధారి సావిత్రి చుట్టూ తిరుగుతుంది. అర్జ‌నుడినిఆమె ప్రేమించ‌డం మొద‌లు.. క‌థ అంతా.. తానే అయి.. చ‌క్రం తిప్పుతుంది. నిజానికి క‌ధ మాట్లాడుతున్న‌ప్పుడు ఇంత పాత్ర ఉంటుంద‌ని సావిత్రికి చెప్ప‌లేదు. కాల్‌షీట్లు కూడా ప‌రిమితంగానే ఉన్నాయి. మ‌రో వైపు.. త‌మిళంలోనూ అదేస‌మ‌యంలో ఎంజీఆర్‌తో సినిమా చేస్తున్నారు సావిత్రి. మొత్తానికి సినిమా అయితే.. ఒప్పుకొన్నారు. కానీ, కాల్ షీట్ల‌కు మ‌రో 5 రోజులు అవ‌స‌రం అయింది. కాద‌న‌లేక‌.. త‌మిళ సినిమాను త్వ‌ర‌గా చేసి.. స‌మ‌యాన్ని ఈ సినిమాకు ఇచ్చార‌ట‌.

అప్ప‌ట్లోనూ జీతాలే. పెద్ద‌గా రెమ్యున‌రేష‌న్ల గురించి ప‌ట్టులేదు. అప్పుడ‌ప్పుడే.. రెమ్యున‌రేష‌న్లు తీసుకునే సంస్కృతి వ‌చ్చింది. పైగా.. బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డిల ద‌గ్గ‌ర ఎవ‌రూ నోరు విప్పి మాట్లాడే ప‌రిస్థితి లేదు. దీంతో సావిత్రికి అన్యాయం జ‌రిగింద‌నే టాక్ వినిపించింది. ఎందుకంటే.. ఆమె ముందు అనుకున్న దానిక‌న్నా.. 5 రోజులు ఎక్కువ‌గా న‌టించారు. దీంతో త‌న‌కు మ‌రో 200 ఎక్కువ ఇప్పించాల‌ని ఆమె కోరారు. చూద్దాం.. అంటూ సినిమా స్టూడియో చెప్పింది. కానీ, ఇవ్వ‌లేదు. సినిమా సూప‌ర్ హిట్ట‌యింది. అయితే.. ఇందులోనూ.. అన్న‌గారికి.. అక్కినేనికి వ‌చ్చిన పేరు సావిత్రికి వ‌చ్చినా.. డ‌బ్బుల విష‌యంలో మాత్రం అన్యాయం జ‌రిగింద‌నే టాక్ ఉంది.