ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత.. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయిన సమంత టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ అంటూ రాజ్యమేలేసింది .
హిట్ ఇచ్చిన హీరోనే పెళ్లి చేసుకున్న సమంత.. ఆ తర్వాత పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసేసుకుంది . ఈ క్రమంలోనే సమంత – నాగచైతన్య మధ్య ఏమైంది ..? ఎందుకు..? విడాకులు తీసుకున్నారు..? అన్న ప్రశ్నలు బోలెడు మెదులాడాయి. రీసెంట్ గానే నాగచైతన్య సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ ల కారణంగానే మేము విడాకులు తీసుకున్నామంటూ కుండ బద్దలు కొట్టేశారు .
అయితే ఒకవేళ నిజంగా మళ్లీ సమంత నాగచైతన్య కలవాలి అంటే.. సమంత సినిమాలు ఆపేయాలని ..అప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి గాసిప్స్ రావని.. మళ్లీ సమంత అక్కినేని ట్యాగ్ వేయించుకోవచ్చు అని చెప్పుకొస్తున్నారు . అయితే సమంత అభిమానులు ఇందుకు రిజెక్ట్ చేస్తున్నారు . ఒక్కసారి నమ్మకం లేకుండా విడాకులు ఇచ్చిన భర్తతో మళ్ళీ ఎలా కలిసి కాపురం చేస్తామంటూ నిలదీస్తున్నారు..? దీంతో సోషల్ మీడియాలో సమంత – చైతన్య డివోర్స్ మేటర్ మరోసారి వైరల్ గా మారింది..!!