స‌మంత ఆ హీరోతో ప్రేమ‌లో ప‌డిందా… కొత్త పుకార్లు మొద‌ల‌య్యాయ్‌…!

స్టార్‌ హీరోయిన్ సమంత గురించి పుకార్లు ఎప్పుడు షికార్లు చేస్తూనే ఉంటాయ‌నే చెప్పాలి. అక్కినేని హీరో నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె సినీ, వ్యక్తిగత జీవితం గురించి కోకొల్ల‌లుగా పుకార్లు వ‌స్తున్నాయి. స‌మంత విడాకుల త‌ర్వాత త‌న సినిమాలు తాను చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో యంగ్ హీరోతో ఆమె ప్రేమ‌లో ప‌డిందా ? అత‌డితోనే పెళ్లి వ్య‌వ‌హారం కూడా ఉంటుందా ? అన్న‌దే ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన మాట‌.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ – సమంత మ‌ధ్య‌ ప్రేమ వ్యవహారం ఘాటుగా న‌డుస్తోంద‌న్న పుకార్లు అయితే బాగా వైర‌ల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరు కలిసి సిటాడెల్‌ అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో న‌టిస్తున్నారు. ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే క‌లిసి న‌టిస్తున్నారు. ఇది భారీ యాక్ష‌న్ సీరిస్ కావ‌డంతో స‌మంత ఈ ప్రాజెక్టుకు భారీగానే డేట్లు కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం… ప్రమోషన్ కోసం విదేశాలకు కూడా వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే సమంత – హీరో వరుణ్ ధావన్ మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని.. ముఖ్యంగా వ‌రుణ్‌… స‌మంత‌ ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటోల‌ను పెట్టి కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా సమంత గురించి మరో పుకారు షికారు చేస్తున్న క్ర‌మంలో ఈ కొత్త ప్రేమాయ‌ణం వార్త‌లు పుకార్లుగానే మిగులుతాయా ? లేదా స‌మంత జీవితంలో మ‌ళ్లీ కొత్త ప్రేమ మొగ్గ తొడిగిందా ? ఈ చిగురించిన కొత్త ప్రేమ ఎన్ని ? రోజులు ఉంటుందో ? కాల‌మే ఆన్స‌ర్ చేయాలి.