రవితేజ కాపురంలో చిచ్చు పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్… విడాకుల వ‌ర‌కు వెళ్లిన క‌థ‌..!

మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు రవితేజ. ప్రస్తుతం టాలీవుడ్ లోనే మాస్ మహారాజా గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ.. ఆయన కెరీర్ మొదటిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థాయిలో సెటిల్ అయ్యాడు. రవితేజ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి పెద్దగా తెలియదు.

2002లో ఇడియ‌ట్ సినిమా రిలీజ్ అయ్యాక‌ తూర్పుగోదావరి జిల్లాలో ర‌వితేజ స్వ‌గ్రామం జగ్గంపేటలో మ‌నోడి పెళ్లి జరిగింది. ఆయన భార్య పేరు కళ్యాణి.. ఈమె మరె ఎవరో కాదు రవితేజ సొంత మేనమామ కూతురు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ఒక కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. రవితేజ భార్య కళ్యాణి పెద్దగా బయట కనిపించరు భర్త పిల్లలను చూసుకుంటూ ఆమె ఎంతో సింపుల్గా ఫ్యామిలీ లైఫ్ కొనసాగిస్తుంది.

ఇదే సమయంలో గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ రవితేజ కాపురంలో చిచ్చుపెట్టిందట. ఆమె పెట్టిన పెంటతో రవితేజ ఆయన భార్య కళ్యాణి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వచ్చి విడాకులు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి. రవితేజ- అనుష్క విక్రమార్కుడు, బలాదూర్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ రెండు సినిమాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

అలాగే రవితేజ- అనుష్క మధ్య కూడా మంచి స‌న్నిహిత్యం ఏర్పడింది. కానీ వీరి సనిహిత్యాన్ని అప్పట్లో మీడియా తప్పుగా ప్రచారం చేసి పెళ్లైన రవితేజతో అనుష్క ప్రేమలోపడిందని.. అంతేకాకుండా రవితేజ తో డేటింగ్ కూడా చేస్తుందని వార్తలు కూడా రాసుకోచ్చాయి. ఈ వార్తలు విన్న రవితేజ భార్య కళ్యాణి ఎంతో బాధపడిందట.. ఆ సమయంలోనే వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట.

చివరకు రవితేజ, ఆమె తల్లి కళ్యాణికి సద్ది చెప్పకు వచ్చారట.. తనకు అనుష్కకి మధ్య ఎలాంటి సంబంధం లేదని.. స్టార్ హీరోలుగా ఉన్న వారిపై ఎలాంటి రూమర్లు ఎప్పుడూ వస్తూ ఉంటాయని వాటిని మనం పట్టించుకోకూడదు అంటూ రవితేజ తన భార్య మనసుకు అర్థమయ్యేలా చెప్పాడట. ఇక అప్పటి నుంచి రవితేజ కూడా అనుష్కతో మరో సినిమా చేయలేదు. అంతేకాకుండా ఆ తర్వాత నుంచి వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించింది కూడా లేదు.