సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. మన టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాధ అసలు పేరు చంద్రిక . కాగా సౌత్ ఇండస్ట్రీలో 25కి పైగా సినిమాల్లో రాధ నటించారు.. కోలీవుడ్ లో వచ్చిన. అళైగళ్ ఓయివత్తిళ్లై అనే సినిమాతో రాధా చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను మొదలుపెట్టింది.
ఈమె కోలీవుడ్లో కమల్ హాసన్, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోలకు కూడా జంటగా నటించడం ఆమె కెరీర్ కు ప్లస్ అయింది. ఆ తర్వాత ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈమె భర్తకు కళ్ళు చెదిరే ఆస్తులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇక రాధ సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టింది. స్టార్ మా లో వచ్చే బీబీ జోడి డాన్స్ షోకీ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు నీతోనే డాన్స్ అనే షోకి కూడా రాధ జడ్జిగా వ్యవహరిస్తూ అలరిస్తుంది. ఇప్పుడు ఈ షోలో తనకు ఎలాంటి మొగుడు అంటే ఇష్టమో అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా నీతోనే డ్యాన్స్ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ జోడీ పంజాబీ క్యాస్టూమ్స్ లో మెప్పించారు. ఆ పర్ఫామెన్స్ ను చూసిన రాధ నాకు పంజాబీ మగాడు అంటే ఇష్టమని ..పంజాబీ మెన్ ను నేను ఎంతగానో లైక్ చేస్తానని పేర్కొన్నారు. ఈ ప్రోమోకు ఏకంగా 14 లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రతి శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది.