ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ఎవరు ఊహించిన బ్యాడ్ టైం నడుస్తుంది. ఎంతలా అంటే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా మనోడికి ఒక్క హిట్ వచ్చి ఆరేళ్ల అవుతోంది. ఎంత భారీ బడ్జెట్లో.. పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా సరే అవి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతూ వస్తున్నాయి. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ఆయనకు హిట్ అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.
అంతేకాకుండా ప్రభాస్ లుక్స్ విషయంలోకూడా భారీ విమర్శలు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ లుక్స్ పై ఘోరంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ సమయంలో ప్రభాస్ ను కొందరు జూనియర్ ఎన్టీఆర్‌తో పోలుస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక సినిమా చేసే సమయంలో ఎన్టీఆర్‌కు ఉన్నంత పట్టు ఇంకెవరికి ఉండదేమో అని.. పైగా ఒక సన్నివేశంలో ఎలా ? నటిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆ సన్నివేశంలో తన నటనతోనే ఆ సీన్‌ను ఎలా రక్తి కట్టించాలో ఎన్టీఆర్‌కు తెలిసినంతగా ఎవరికి తెలియదన్నంత ప్రశంసలు ఉన్నాయి.
అందుకే ఆయన నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి.. కథ వీక్ గా ఉన్నా కూడా.. స్క్రీన్ ప్లే మేకింగ్ ఫర్ఫెక్ట్ గా లేకపోయినా ఎన్టీఆర్ తన నటనతో సినిమాలను హిట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బృందావనం, అరవింద సమేత, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ ఇవన్నీ కూడా యావరేజ్ కంటెంట్‌తో వచ్చి ఎన్టీఆర్ నటనతో హిట్ కొట్టినవే..!
జై లవకుశ, అరవింద సమేత లాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు కొట్టాడంటే అది కేవలం ఎన్టీఆర్ నటనకు ఉన్న బలమే. ఇలా ప్రభాస్ ను ఎన్టీఆర్‌తో పోలిస్తూ ప్రభాస్ నువ్వు పాన్ ఇండియా సినిమాలు చేయడం కంటే కూడా నటన, లుక్స్‌పై మరింత కాన్‌సంట్రేషన్ చేయాలన్న సూచనలు, సలహాలు సోషల్ మీడియా వేదికగా చాలా మంది చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటకి అయినా ఎన్టీఆర్ మాదిరిగా సరైన కథలను ఎంచుకుంటూ నటనపై ఫోకస్ పెడుతూ హిట్లు కొడతాడేమో ? చూద్దాం..!