యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. అంచెలంచెలుగా ఎదిగారు.ఇక కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు సైతం ఆయనకు అభిమానులుగా మారారు.హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఓ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉందని తన మనసులో మాటను చెప్పారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బయటికి చాలా ఆవేశపరుడిలా కనిపిస్తారు కానీ.. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయన గురించి ఓ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యమదొంగ సినిమాకి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది.
ఇక అసలు విషయం ఏంటంటే.ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన యమదొంగ సినిమలో ఎన్టీఆర్ సరసన ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో తాత సినిమాలోని ఓలమ్మి తిక్కరేగిందా. అనే సాంగ్ ను రీమేక్ చేశారు.అయితే ఈ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ను వాయించి వదిలేస్తాడు తారక్.
కానీ.. పాట పూర్తయ్యాక మమతకు ఫోన్ చేసి మరీ.. అలా చేసినందుకు సారీ చెప్పాడట. అంత పెద్ద హీరో.. దానికి సారీ చెప్పడం చూసి మమతా మోహన్ దాస్ కూడా ఫిదా అయిపోయిందట. .ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ అవ్వటంతో. ఎన్టీఆర్ మనసు ఎంత మంచిదో.. ఆయన మనసు ఎంత సున్నితమైనదో అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.