నిహారిక – చైతన్య ఇద్దరిలో ఫ‌స్ట్ విడాకులు కోరింది ఎవ‌రంటే…!

నిహారిక – జొన్నల గడ్డ చైతన్య ఇద్దరు విడాకులు తీసుకున్న వార్తలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చినప్పటికీ దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ గాని ఎవరు స్పందించకపోవడంతో ఈ వార్త నిజం కాదని కొట్టిపాడేశారు నెటిజ‌న్స్. కానీ తాజాగా వీరిద్దరి విడాకుల పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి విడాకులు నిజమే అని క్లారిటీ వచ్చేసింది.

కాని వీరిద్దరిలో మొదటిగా ఎవరు..? విడాకులు కోరుకున్నారు అనే సందేహం చాలామందిలో ఉంది. 2020లో వివాహ బంధంతో ఒకటైన ఇద్దరి జంట ఎంతోకాలం కలిసి ఉండలేకపోయారు. ఏవో మనస్పర్ధలు కారణంగా ఒకరితో ఒకరు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల కోరుతూ మొదటిగా జొన్నలగడ్డ చైతన్య పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది.

అలాగే నిహారిక తరపున పిటిషన్ వేసిన లాయర్ కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయిన దిలీప్ సుంక‌ర కావడంతో ఈ న్యూస్ మరింతగా వైరల్ అయింది. దిలీప్‌ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, జనసేన మద్దతుదారుడు. కళ్యాణ్ దిలీప్ సుంకర నాగబాబు కు మంచి స్నేహితుడు. నిహారిక – చైతన్యల విడాకులతో అభిమానులకు పెద్ద షాక్ తగిలింది.

ప్రస్తుతం నిహారిక – చైతన్యలు విడిపోవడానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటనే అంశంపై చర్చలు జరుగుతున్నా ఈ విషయాలన్నీ మెగా ఫ్యామిలీ ర‌హాస్యంగా ఉంచింది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. నిహారిక ఓటీటీ వెబ్ సిరీస్‌లో బిజీగా ఉండగా.. చైతన్య త‌న వ్యాపార వ్య‌వ‌హారాలు చూసుకుంటు బిజీగా గడుపుతున్నాడు.