న‌రేష్ మూడో పెళ్లి మ‌ళ్లీ అదే లొల్లి… న‌రేష్‌ను ఫుల్లుగా ఇరికించేసిన ర‌మ్య ర‌ఘుప‌తి..!

సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్నో వివాదాలు చెలరేగాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ సినిమాలో నరేష్ తో పాటు నరేష్‌కు కాబోయే నాలుగో భార్య పవిత్ర లోకేష్ జంటగా నటించారు. థియేటర్లలో ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.. ఇప్పుడు ఓటిటి రిలీజ్ సమయంలో ఈ సినిమాకు మళ్ళీ ఇబ్బందులు తప్పలేదు.

మళ్లీ పెళ్లి సినిమాను రెండు ఓటిటిల్లో స్ట్రీమింగ్ పెట్టేలా నరేష్ ఒప్పందం చేసుకున్నారు. అమ్మోజాన్ ప్రేమ్ వీడియోస్ తో పాటు ఆహాలో నాన్ ఎక్స్క్లూసివ్ రైట్స్ కింద సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న మళ్లీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ ఆపాలని ఆమె కూకట్‌ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ప్రకారం అమోజాన్ మళ్లీ పెళ్లి సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టలేదు. అయితే ఆహా వాళ్లు మాత్రం స్ట్రీమింగ్ కు పెట్టేశారు. అలా నరేష్ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లీగల్ ఇష్యూను నరేష్ ఎలా ? ఎదుర్కొంటారు అన్నది చూడాలి. అగ్రిమెంట్ విషయంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ‌ కచ్చితంగా ఉంటుంది. సినిమా రైట్స్ కింద ఆ కంపెనీ ఇప్పటికే నరేష్ కు డబ్బులు చెల్లించినట్టు తెలిసింది.

ఇప్పుడు రమ్య రఘుపతి వేసిన పిటిషన్ తో అమోజాన్ వాళ్ళు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టలేదు. ఏదైనా తేడా వస్తే నరేష్ నిర్మాతగా డబ్బులు వాళ్లకు తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఏది ఏమైనా రమ్యా రఘుపతి మరోసారి నరేష్‌ను చిక్కుల్లోకి పెట్టింది. తాను నరేష్‌కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్న‌ రమ్య పవిత్ర – నరేష్ పెళ్లికి ప్రధాన అడ్డంకిగా మారనుంది.

మరి నరేష్ రమ్య రఘుపతి ఇష్యూను ఎప్పటికీ సెటిల్ చేసుకొని పవిత్రను తన భార్య‌గా చేసుకుంటారో కాలమే ఆన్సర్ చేయాలి. ఇక నరేష్ నిజజీవితంలో జరిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగానే మళ్లీ పెళ్లి సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో నరేష్ లవర్ గా నటించింది. సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు న‌టించ‌గా… ఆయ‌న‌కిదే తెలుగు సినిమా..!