టాలీవుడ్ చందమామ అంటే గుర్తుకొచ్చే పేరు కాజల్ అగర్వాల్.. దాదాపు పది సంవత్సరాల కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లిలైనా కూడా ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. అయితే మరి ఈ అందాల చందమామ బ్యూటీ సీక్రెట్ ఏమిటో తెలుసా.. అందరూ అనుకుంటున్న డైట్, యోగా, జిమ్ వర్క్ వంటివి కానే కాదు.
ఉదయం నిద్ర లేచిన వెంటనే చిన్నపాటి ఎక్సర్సైజులు చేసి.. ఆ తర్వాత ఉడకపెట్టిన కోడిగుడ్డు తింటుందట. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో ఒక జొన్న రొట్టెను కర్రీ తో పాటు తింటుందట. మధ్యాహ్నం భోజనంలో రాత్రి డిన్నర్ లో కచ్చితంగా పప్పు ఉండాల్సిందేనట. ప్రతిరోజు రెండు పూటలా రైస్ పప్పు తింటుందట. పప్పు కాజల్‌కు ఎంతో ఫేవరెట్. వీటితోపాటు పాలక్ పన్నీరు కూడా ఎంతో ఇష్టంగా తింటుందట. అలాగే ప్రోటీన్ షేక్స్, కొబ్బరినీళ్లు వంటివి రెగ్యులర్‌గా తీసుకుంటుంది.
అదే సమయంలో నాన్ వెజ్‌ను మాత్రం తన దగ్గరకు రానివ్వదట. నాన్ వెజ్ స్మెల్ కూడా కాజల్‌కు అసలు ఇష్టం ఉండదట. ఫెస్టివల్స్ రోజున మాత్రం వాళ్ళ అమ్మ చేత్తో చేసిన పరోటాలను కడుపునిండా లాగించేస్తానని కాజల్ స్వయంగా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ కాస్త ఎప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాజల్ సినిమాలు విషయానికి వస్తే ఈ బ్యూటీ చేతిలో చేత నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగులో బాలకృష్ణతో భగవంత్ కేసరి, కమలహాసన్ తో భారతీయుడు 2 తో పాటు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తుంది. ఈ విధంగా కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన అందంతో పాటు సినిమాలతో కూడా దూసుకుపోతుంది.