ఎస్ ఇది నిజంగానే విచిత్రం.. టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. అంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగ్నేష దర్శకత్వంలో గతేడాది ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇక ఈ యేడాది రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి వార్తలేవీ బయటకు రావట్లేదు. ఆ తర్వాత నితిన్ రెండో సినిమా కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లో రెండో సినిమా తెరకెక్కనుంది. ఇక ఇప్పుడు మూడో సినిమా కూడా లైన్లో పెట్టేసినట్టు తెలుస్తోంది. తన బావమరిది మూడో సినిమా కోసం ఎన్టీఆరే స్వయంగా రంగంలోకి దిగి సెట్ చేశాడంటున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో నితిన్ చంద్ర మూడో సినిమా ఉంటుందంటున్నారు. గీతా సంస్థ ఇటీవల మీడిల్ రేంజ్ హీరోలతో మిడిల్ రేంజ్ దర్శకులతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య – చందు మొండేటి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – బన్నీ బావ.. బావ అని ఎంతో అప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు.
ఆ చనువుతోనే తన బావమరిది మూడో సినిమాను బన్నీ ఫ్యామిలీకే చెందిన గీతా బ్యానర్లో నిర్మిస్తే బావుంటుందని ఎన్టీఆర్ సూచించాడట. ఎన్టీఆర్ అడిగితే గీతా వాళ్లు కాదంటారా ? నితిన్ చంద్ర మూడో సినిమాను తమ బ్యానర్లో నిర్మించేందుకు ఓకే అయిపోయింది. ఇక ఫస్ట్ రెండు సినిమాలు పూర్తవ్వడమే ఈ ప్రాజెక్టు తెరమీదకు వెళుతుంది.