దివ్య భారతి.. కేవలం 6 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్. అయితే.. అతి తక్కువ కాలమే ఉన్నప్పటికీ.. అనేక సినిమాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకునేలా.. తరతరాల పాటు నిలిచిపోయేలా దివ్యభారతి నటించింది. అంతేకాదు.. అనేక మంది అగ్రతారలతోనూ ఆమె నటిం చింది. అయితే… ఆమె అతితక్కువ వయసులోనే ఎంతో మంచి సినిమాలు దక్కించుకున్నా.. అంతే స్థాయిలో వివాదాస్పదం కూడా అయ్యారు.
దివ్యభారతి ఎంట్రీ ఇవ్వడం నుంచి ఆత్మహత్య వరకు కూడా ఆమె జీవితం.. ఒక మిస్టరీలా మారిపోయిం దనేది అందరికీ తెలిసిందే. ఆమె చాలా మందితో డేటింగ్ కూడా చేసిందని అంటారు. ఈ వివాదాలే ఆమెను ప్రాణాల మీదకు వచ్చేలా చేసిందని చెబుతారు. బాలీవుడ్ నిర్మాతతో చాలాకాలం సాగించిన ప్రేమాయణం కారణంగా.. దివ్య భారతి తన సొమ్మును చాలా వరకు కోల్పోయారని చెబుతారు.
అదేవిధంగా తెలుగులోనూ ఒక ప్రముఖ నిర్మాతతో రెండు రోజులు పాటు విదేశాల్లో పర్యటించారని చెబు తారు. దీనివల్ల ఆమెకు ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. కానీ, తర్వాత.. ఆమె బాలీవు డ్ ఎంట్రీ ఇచ్చి.. కొన్ని సినిమాల్లో నటించినా.. ఇది వివాదాలకు.. దారితీసిందనే హిస్టరీని నిలబెట్టుకుం ది. ఇక, దివ్య భారతి మరణం తర్వాత.. సంగతులపై అనేక కథనాలు వచ్చాయి. ఒక బాలీవుడ్ నిర్మాత ఏకంగా ఆమె జీవితం, మరణంపై సీరియల్స్ చేశారు. అయితే.. ఇది ఇంకా విడుదల కావాల్సి ఉంది.