త్రివిక్రమ్ ఇష్టానికి బన్నీ బలి.. గురూజీ పై గుర్రుగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్..!!

మన టాలీవుడ్ లో బాగా కలిసి వచ్చిన కాంబినేషన్లల్లో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబో కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలుకు పైగా వచ్చాయి. అంతేకాకుండా వీరి కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు మళ్లీ వీరి కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ – పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తర్వాత సినిమా ఫిక్స్ అయ్యాడు. ఇక దానికి సంబంధించిన అధికార ప్రకటన కూడా ఈరోజు వచ్చేసింది. ఇక ఇదే వార్తను ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ కాంబోను మరోసారి రిపీట్ చేయబోతున్నారు త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్. పుష్ప2 సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం త్రివేక్రమ్‌, మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్‌తో చేసే సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనాన్‌ను కన్ఫామ్ చేశాడట గురూజీ.

ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి త్రివిక్రమ్ సంయుక్త మీనాన్‌కి బాగా కనెక్ట్ అయిపోయాడు అంటూ జనాలు బుర్ర పీక్కుంటున్నారు. మన టాలీవుడ్ లో ఎంతోమంది పాన్‌ ఇండియా హీరోయిన్లు ఉన్నా వారందరినీ వదిలిపెట్టి.. ఈ మలయాళీ బ్యూటీని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌తో కూడా ఈ బ్యూటీ నటించబోతుందని తెలియడంతో బన్నీ క్రేజ్‌కి సంయుక్త అసలు సెట్ అవ్వదని త్రివిక్రమ్‌ సంయుక్త పైన ఉన్న ఇష్టంతో బన్నీని బలి చేస్తున్నాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు. మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి..?