ఆ సినిమాకు ఎన్టీఆర్ షరతులు.. కండీష‌న్లు చూసి బాల‌య్య షాక్‌…!

నమ్ముకున్న వృత్తిని చాలా మంది గౌరవిస్తారు. అలాంటి వారిలో దివంగత మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కూడా ఉంటారు. సినీ నటులకు, టెక్నీషియన్లకు ఆయన ఎంతగానో గౌరవం ఇచ్చే వారు. ముఖ్యంగా సీనియర్ నటులను ఎలా గౌరవించాలో ఇతరులకు చెప్పేవారు. ఇదే విషయాన్ని తన కొడుకు బాలకృష్ణకు బాగా నూరిపోశారట. ఆయన కెరీర్ బాగుండేందుకు ఎంతగానో ఎన్టీఆర్ కేరింగ్ తీసుకున్నారు.

ఇక బాలకృష్ణను స్టార్ హీరోగా మార్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. తమిళంలో మన్ వాసనై అనే పేరుతో విడుదలై చక్కటి విజయాన్ని సాధించింది. అక్కడ భారతీరాజా దర్శకుడు. తెలుగులో మంగమ్మ గారి మనవడు పేరుతో తెరకెక్కిిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

ఇక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా బాలకృష్ణను స్టార్ హీరోగా నిలబెట్టింది. అయితే ఈ సినిమా విషయంలో బాలకృష్ణకు ఎన్టీఆర్ కండిషన్లు పెట్టారు. అందులో మంగమ్మ పాత్రను సీనియర్ నటి భానుమతి పోషించారు. ఆమె ఒకానొక సమయంలో నటిగానే కాకుండా దర్శకురాలిగా, సింగర్ గా, నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచింది.

అలాంటి సీనియర్ నటిని ఎలా చూసుకోవాలో, ఎలా గౌరవించాలో పలు కండిషన్లను బాలయ్యకు ఎన్టీఆర్ విధించారట. ఆమె రాకుండానే అరగంట ముందుగానే షూటింగ్‌కు వెళ్లాలని, ముఖ్యంగా భానుమతి సెట్‌లోకి రాగానే ఆమె కాళ్లకు నమస్కరించాలని, కారు డోర్ స్వయంగా తీయాలని బాలకృష్ణకు తెలిపారట. ఏ ఒక్క రోజు కూడా షూటింగ్‌లో ఆమెను వెయిట్ చేయించకూడదని మరీ మరీ చెప్పారట.

ఇలాంటివి వింటే ఎవరైనా తొలుత షాక్ అవుతారు. అయితే బాలయ్య మాత్రం తన తండ్రి చెప్పిన మాటలను జవదాటలేదు. షూటింగ్ మొత్తం భానుమతిని చాలా బాగా చూసుకున్నారు. వారు అనుకున్నట్లే సినిమా కూడా చక్కగా పూర్తి అయింది. విడుదలైన తర్వాత భారీ విజయాన్ని దక్కించుకుంది. బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.