ఎంతో క్లోజ్ గా ఉండే బాలయ్య- నాగార్జున మధ్య.. చిచ్చు పెట్టింది ఆ స్టార్ హీరో నేనా..!?

చిత్ర పరిశ్రమలో ఉండే కొంతమంది హీరోలు, హీరోయిన్ల మధ్య ఎంతో మంచి అనుబంధం, సాన్నిహిత్యం ఉండటం అనేది చాలా అరుదు. గతంలో మన టాలీవుడ్‌కు దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోల మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది. అంతేకాకుండా వీరి కాంబినేషన్లో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు కూడా వచ్చాయంటే గతంలో వీరి మధ్య అనుబంధం ఎలా ఉండేదో మన అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ వారి తర్వాత వచ్చిన వారసులు బాలకృష్ణ- నాగార్జున మాత్రం ఉప్పు- నిప్పులా ఉండేవారు. ఇద్దరూ ఎప్పుడో మొక్కుబడిగా ఏ ఫంక్షన్ లో కలిసినప్పుడు మాత్రమే పలకరింపులు ఉండేవి. తర్వాత ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా దూరంగా ఉండేవారు. ఇదే సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాగార్జున- బాలకృష్ణ కూడా ఎంతో క్లోజ్ గా ఉండేవారట అయితే వీరి మ‌ధ్య‌ ఇంత దూరం పెరగడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాలకృష్ణ- నాగార్జున సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వీరి మధ్య ఎంతో పోటీ ఉండేది. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య పోటీ అనేది ఎంతో కామ‌న్‌. కానీ నాగార్జునకి బాలకృష్ణకి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణ వేరే ఉందట. బాలయ్య- నాగార్జున మధ్య ఉన్న అనుబంధంలో దూరం పెరగడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తుంది.

ఇక గతంలో నాగార్జున చాలాసార్లు చిరంజీవికి సపోర్టుగా ఉంటూ బాలయ్యని ఇబ్బంది పెట్టే వారట. తరచూ టాలీవుడ్ లో బాలకృష్ణని పక్కనపెట్టి మెగాస్టార్ భజన చేస్తూ అన్నయ్య అన్నయ్య అంటూ తిరగడంలో బాలకృష్ణకి కోపం వచ్చిందట. ఆ కారణంతోనే నాగార్జున- బాలకృష్ణ మధ్య దూరం పెరిగింది అంటూ ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు.