కబాలి తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరిని ఎప్పుడు అయితే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారో, ఆ వెంటనే సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. దాదాపు 12 మంది పేర్లు లీక్ అవ్వగా, అందులో టాలీవుడ్ బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఒక్కటే హాట్ టాపిక్ గా మారింది.
ఇక అషుతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ఆమె ఫోన్ నంబర్ కూడా బయటపెట్టడంతో అది సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. ఈ వార్తలపై అషు రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించింది. కొంతమందితో తనకున్న అసోసియేషన్ పై కొన్ని మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని… కొన్ని గంటలుగా తనపై వస్తోన్న వార్తలను ఖండిస్తున్నానని ఆమె తెలిపింది.
ఇక ఈ మాదక ద్రవ్యాల కేసు విషయంలో చెప్పాల్సిన వ్యక్తులకే అసలు నిజాలు చెపుతానని కూడా తేల్చి చెప్పింది. ఇక తన పర్సనల్ ఫోన్ నంబర్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టడాన్ని ఎంతమాత్రం సహించనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కేపీ చౌదరితో లింకులు ఉన్నాయంటూ అషురెడ్డి పేరు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే వెంటనే స్పందించడంతో పాటు తన సోషల్ మీడియా వాల్ లో అషురెడ్డి ఈ ప్రకటన చేసింది.
ఇక రెండు రోజుల పాటు కేపి చౌదరి పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ విచారణ ముగిసిన వెంటనే ఆమె పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. ఆమెతో కేపీ చౌదరి వందల కోద్దీ ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే చౌదరి మాత్రం తాను మాత్రమే డ్రగ్స్ తీసుకున్నానని.. తాను వవ్వరికి సరఫరా చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోలీసుల ఛార్జ్‌షీట్‌లో అషురెడ్డి పేరు ఉంటే మాత్రం ఆమె తప్పకుండా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే..!