టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ బ్యానర్ యు వీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా…. మహేష్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక గత సినిమాల లాగా ఈ సినిమాని కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్‌తో ఆడియన్స్‌కి పిచ్చెక్కించాలని ఫిక్స్ అయ్యాడు నవీన్. ఇక అనుష్కలాంటి స్టార్ హీరోయిన్ నవీన్ తో కలిసి నటించడం అంటే పెద్ద షాకింగ్ న్యూస్.
ఇదే సమయంలో మరో పెద్ద విషయం ఏమిటంటే అనుష్కతో కలిసి నటించడమే కాకుండా ఈ సినిమాలో ఆమెతో కలిసి రొమాంటిక్ సీన్లో కూడా నటించబోతున్నాడట నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా కూడా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతుందట. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చి ఓ ఫన్నీ సన్నివేశంలో భాగంగా అనుష్క- నవీన్ పోలిశెట్టితో లిప్ లాక్ కూడా ఇస్తుందట.
అనుష్క ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో ప్రభాస్‌కు తప్ప మరి ఏ హీరోకు కూడా లిప్ లాక్ ఇచ్చింది లేదు. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన నవీన్ పోలిశెట్టితో ఇలాంటి సన్నివేశంలో నటిస్తుందా ? అంటే అది ఖచ్చితంగా పెద్ద సెన్షేషనే అవుతుంది. అయితే అనుష్కకు జంటగా కొందరికి మాత్రమే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మరి నవీన్ స్వీటీకి పర్ఫెక్ట్ జోడీ అవుతాడా కాదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.