అల్లు అర్జున్ కోపం వస్తే అలా చేస్తాడా..? నిజంగానే చేతులెత్తి దండం పెట్టాలి..!

మనిషి అన్నాక.. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి . అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏ మనిషికి అది సాధ్యం కాదు . అలా కంట్రోల్ చేసుకున్న వ్యక్తి అసలు మనిషేకాడు అంటుంటారు మన ఇంట్లోనే పెద్దవాళ్లు . అయితే కేవలం సామాన్య జనాలకే కోపాలు ..రోషాలు, పౌరుషాలు ఉంటాయా అంటే కాదని చెప్పాలి . కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోలు కూడా కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరుతూ ఉంటారు. కోపంలో టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు . వాళ్లకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి .

డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోదు కదా ..మనిషికి మనశ్శాంతి కూడా కావాలి . అలాంటి మనశ్శాంతి లేని హీరోలు మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే ..ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప2 సినిమాతో గ్లోబల్ వైడ్ గా తన పేరును మారుమ్రోగిపోయేలా చేయాలనుకున్నాడు.

దానికి తగ్గ కసరత్తులు కూడా చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి కోపం ఎక్కువ గా ఉంటుంది కదా..? మరి నిజ జీవితంలో కూడా అల్లు అర్జున్కి అంతే కోపం ఉంటుందా? ఒకవేళ అంత కోపం వస్తే ఏం చేస్తాడు ..? అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అయితే దీనికి అభిమానుల దగ్గర నుంచి వెరైటీ వెరైటీ ఆన్సర్లు వస్తున్నాయి . కొందరు అల్లు అర్జున్ కి అసలు కోపం రాదని.. చాలా కూల్ గా ఉంటాడని అంటుంటే .. మరి కొందరు అల్లు అర్జున్ కి కోపం వస్తే సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకునేస్తాడని ..కోపం కంట్రోల్ అయ్యాక బయటికి వచ్చి మళ్ళీ చిల్ అవుట్ అవుతాడని ..అంతేకానీ పక్కన ఉన్న వస్తువులను పగలగొట్టడం ..బిడ్డలని కొట్టడం.. భార్యను అరవడం లాంటి చీప్ పనులు అల్లు అర్జున్ చేయడని చెప్పుకొస్తున్నారు . దీంతో కొందరు ఫన్నీగా నిజమే మీ హీరోకి చేతులెత్తి దండం పెట్టాల్సిందే అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!