స్టార్ హీరోయిన్ రష్మిక కెరీర్ కు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఓ మార్పు జరిగింది. ఇప్పటి వరకు ఆమెతో పాటు ఉన్న ఆమె మేనేజర్ సైడ్ అయ్యాడు. అతడే స్వయంగా తప్పుకున్నాడా ? లేదా ? కావాలనే రష్మికానే అతడ్ని పనిలోంచి తీసేసిందా ? అనేది హాట్ టాపిక్. దీనిపై మరో సరికొత్త పుకారు కూడా బయలు దేరింది. రష్మిక మేనేజర్ ఏకంగా 80 లక్షల వరకు స్కామ్ చేశాడట. ఇది రష్మికకు కోపం తెప్పించింది.
ఈ కారణంతోనే రష్మిక అతడిని తన మేనేజర్ బాధ్యతల నుంచి తప్పించేసిందంటున్నారు. అయితే ఇది చిలువలు పలువలుగా మారింది. దీనిపై రష్మిక స్పందించింది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు వచ్చిన అన్ని రకాల ఊహాగానాల్ని ఆమె ఖండించింది. తన మేనేజర్, తాను విడిపోవడం వెనక ఎలాంటి గొడవలు జరగలేదని… ఇప్పటి వరకు ఆరోగ్యకర వాతావరణంలో పనిచేసి.. ఇప్పుడు అంగీకారంతోనే విడిపోయినట్టు చెప్పింది.
ఇప్పటి వరకు తామిద్దరం అంగీకారంతో పనిచేసినా .. ఇప్పుడు కూడా అలాగే విడిపోయినట్టు చెప్పింది. ఈ మేరకు తన మాజీ మేనేజర్‌తో కలిసి రష్మిక సంయుక్తంగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ యానిమల్ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ దర్శకుడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు తానే మెయిన్ లీడ్‌లో రెయిన్ బో అనే సినిమా కూడా స్టార్ట్ చేసింది. ఇలా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే రష్మిక తన మేనేజర్‌కు ఉద్వాసన పలికి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.