బిగ్ బ్రేకింగ్.. కీర్తిసురేష్‌తో నాగచైతన్య డేటింగ్.. శోభిత ధూళిపాళ్ల‌తో బ్రేకప్… ?

పై టైటిల్ చూసిన వెంటనే అందరికీ ఒక్కసారిగా షాకింగ్‌గా అనిపిస్తుంది. నాగచైతన్య ఏంటి కీర్తిసురేష్ తో ప్రేమ ఏంటి..? అన్న సందేహాలు అందరికీ వస్తాయి. ఈ అక్కినేని హీరో ముందుగా స్టార్ హీరోయిన్ సమంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకునీ కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుని ఎవరి పని వారు చేసుకుంటున్నారు. నాగచైతన్య గత సంవత్సర కాలంగా మరో తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ‌తో ప్రేమలో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలను నిజం అనుకునేలా ఈ ఇద్దరూ కలిసి జంట రెస్టారెంట్‌లు, వెకేషన్‌లు అంటూ తిరుగుతూ కనిపిస్తున్నారు. దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్ర‌చారం కూడా వినిపిస్తుంది.
ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్‌ను లవ్ చేస్తున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్ లో మాత్రం కాదు. రీల్ లైఫ్ లో కీర్తిసురేష్ ప్రేమలో నాగచైతన్య పడబోతున్నారట.

నాగచైతన్య- చందూ మెండేటి దర్శకత్వంలో రాబోయే సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి సూరత్ నేపథ్యంలో సాగే మధురమైన ప్రేమ కథగా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య పడవ నడిపే డ్రైవర్గా నటిస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్‌, కీర్తి సురేశ్ పేర్ల‌ను ప‌రిశీలించార‌ట‌.

చివరకు కీర్తి సురేష్ పేరుని ఖాయం చేసినట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్- చైతు కలిసి నటించడం ఇది మొదటి సారి ఏమీ కాదు. మహానటి సినిమాలో చైతన్యతో కీర్తిసురేష్ రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తారు. ఇప్పుడు చందు మోండేటి దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో చైతుకు జంటగా కీర్తి నటిస్తుంది. ఇక మరి ఈ సినిమాతో అయినా చైతు సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.