సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని.. ఓవర్ నైట్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అయిపోవాలన్న కోరిక చాలా మందిలో సహజంగానే ఉంటుంది. అలా కెరీర్ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు చిరంజీవి లేదా ఓ సమంత లేదా రాజమౌళి అయిపోవాలని కలలు కంటూనే ఉంటారు. అయితే ఆ అవకాశం టాలెంట్ ఉన్నా కూడా కొద్దిమందికే వస్తుంది. సినీ రంగంలో టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ తోపులు తురుములు అయిన హీరోలు కూడా తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోయారు.
ఇందుకు ఎన్నో పేర్లు ఉదాహరణలుగా ఉంటాయి. ఇక రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ డైరెక్టర్. బాహుబలితో దేశవ్యాప్తంగా తన చాటిన ఆయన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యారు. ఇక రాజమౌళి సినిమాల విజయంలో ఆయన సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాత్ర ఎంతో ఉంటుంది. కీరవాణి రాజమౌళి సినిమాలకు ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ ఇస్తుంటారు.
అయితే అంత గొప్పబ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతడు సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలి. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాలు వచ్చినా అతడు ఏ సినిమాలు చేస్తున్నాడో ఎవ్వరికి తెలియట్లేదు. అసలు కీరవాణి కొడుకు సినిమా హీరో అయ్యాడన్నది ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదు.
శ్రీసింహాను హీరోగా నిలబెట్టాలనుకుంటే వీళ్లకు పెద్ద కష్టం కాదు. రాజమౌళి సోదరుడు కీరవాణి ఏకంగా ఆస్కార్ గెలుచుకున్నారు. రాజమౌళి తండ్రి మంచి స్టోరీ రైటర్… వీరి కుటుంబంలో అందరికి సినీ టాలెంట్ ఉంది. ఇక శ్రీ సింహా ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసినా హిట్ లేదు. ఫస్ట్ సినిమా మత్తు వదలరా జస్ట్ ఓకే. ఆ తర్వాత తెల్లారితే గురువారం – దొంగలున్నారు జాగ్రత్త సినిమాలతో బొక్క బోర్లా పడ్డాడు. రీసెంట్ గా వచ్చిన భాగ్ సాలే కూడా అట్టర్ ప్లాప్.
రాజమౌళి శ్రీ సింహాతో సినిమా చేయలేకపోవచ్చు.. తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఇవ్వవచ్చు. అతడి సినిమాలకు కథల్లో సాయం చేయవచ్చు. ఇలా కుటుంబం అండగా ఉన్నట్టు కనపడడం లేదు. అందుకే శ్రీ సింహా సినిమాలు ఇంత దారుణంగా తయరయ్యాయి. రాజమౌళి.. వాళ్ల ఫ్యామిలీ కాస్త శ్రీ సింహ పై ఫోకస్ పెడితే అతడికి టాలీవుడ్ లో తిరుగుండదు.. లేకపోతే రాజమౌళి అన్న కొడుకు జీరో అనడంలోనూ సందేహాలు ఉండవు.