టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతోపాటు.. ఎన్టీఆర్ – కొరటాల లాంటి హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలం క్రితం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ప్రతి సన్నివేశాన్ని ఒకటికి రెండు సార్లు చూసి మరి ఓకే చేస్తున్నాడు కొరటాల శివ.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న దేవర టీం సంగీత దర్శకుడిని ఎంచుకునే విషయంలో రాంగ్ స్టెప్ వేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్‌ని ఎంచుకున్నారు. కోలివుడ్లో అనిరుధ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇటీవల కోలీవుడ్‌లో అనిరుధ్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందించిన లియో – జైలర్ పాటలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఈ రెండు ఆల్బమ్స్ మినిమం ఆసక్తిని కూడా క్రియేట్ చేయలేదు. పాటలు మరి నాసిరకంగా ఉన్నాయంటూ ఇలాంటి పాటలు ఇస్తున్నావ్ ఏంటి? అనిరుధ్ అంటు సోషల్ మీడియా వేదికగా చాలా మంది విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. లియో సినిమాలో పాటలు విజయ్‌తో పాడించినా ఇది ఆకట్టుకోలేకపోయింది. జైలర్ సినిమాలో అనిరుధ్ అందించిన పాటకు తమన్నా ఎంత స్కిన్ షో చేసినా ఆ పాట సక్సెస్ కాలేదు.
ఈ టైంలో అనిరుధ్.. దేవర సినిమాకు పాటలు పాడడం కరెక్ట్ కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా డైరెక్టర్ అభిరుచిని బట్టి పాటల ట్యూన్స్ ఉంటాయి కదా అంటున్నారు. అయితే కొరటాల అనిరుధ్‌తో ఎంత మంచి వర్క్ చేయించుకునేందుకు ట్రై చేసినా అతడి నుంచి మాత్రం బెస్ట్ అవుట్ ఫుట్ రాకపోతే దేవరకు అతడు పెద్ద మిస్ ఫైర్ అయినట్టు అన్న గుసగుసలే నడుస్తున్నాయి.