అస‌లు మాధ‌వీల‌త‌ను ఎంత‌మంది… సె…*కు అడిగారు.. లిస్టులో ఈ పెద్దోళ్లంతా ఉన్నారా…!

కొత్తగా రంగుల ప్రపంచ విహరించాలని ఎంతోమంది అమ్మాయిలు సీనీ ప్ర‌పంచంలోకి ఎంట‌ర్ అవుతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్పుడు చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. ఇక తెలుగు అమ్మాయి మాధ‌వీల‌త ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల పేరుతో అమ్మాయిల‌ను ఎలా ? వాడుకుంటారో ? చాలా రోజుల నుంచి గ‌ళ‌మెత్తుతోంది.

ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నచ్చావులే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ లు లేక‌పోయినా తెలుగు హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారని.. దర్శక, నిర్మాతలు చెప్పినట్లు వినాలని అప్పుడే ఇక్క‌డ అమ్మాయిల‌కు హీరోయిన్లుగా ఛాన్సులు ఇస్తూ ఉంటార‌ని… లైం..క వేధింపుల గురించి చాలాసార్లు ఓపెన్ అవుతూ వ‌స్తోంది.

ఇక తాను హీరోయిన్‌గా ట్రై చేస్తోన్న టైంలో జ‌రిగిన ఓ ఇన్సిడెంట్ గురించి కూడా మాధ‌వీల‌త చెప్పింది. ఓ కో ఆర్డినేట‌ర్ త‌న‌కు ఫోన్ చేసి హీరోయిన్‌గా మంచి ఆఫ‌ర్ ఉంది.. కాక‌పోతే ముందు క‌మిట్‌మెంట్ ఇవ్వాలి… ఓ రోజు రాత్రి నాతో… ఆ త‌ర్వాత నీ ఫిగ‌ర్ గురించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చెపుతాన‌ని అన్నాడ‌ట‌. వెంట‌నే అత‌డిని తిట్టేసి ఫోన్ క‌ట్ చేసింద‌ట‌. అత‌డు చెప్పిన ఆ లిస్టులో పెద్ద పెద్ద ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఉన్నార‌ట‌.

ఆ త‌ర్వాత కూడా ఎంతోమంది కో ఆర్డినేట‌ర్లు డైరెక్టుగా ఫోన్ చేసి ఇలా అడిగేవార‌ని మాధ‌వీ చెప్పింది. సినిమాల్లో స్టార్లుగా రాణించాలంటే ఇలాంటివి కామ‌న్ అయిపోయాయ‌ని.. అందుకు ఒప్పుకుంట‌నే మంచి ఆఫ‌ర్ ఇస్తామ‌ని డైరెక్టుగానే అడిగేస్తున్నారంటూ చెప్పింది. చాలా మంది గ‌తిలేక చిన్న చిన్న పాత్ర‌ల కోసం కూడా త‌మ శరీ… న్ని లంచంగా అర్పించేసుకుంటున్నార‌ని.. ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలని తాను కోరుకుంటున్న‌ట్టు మాధవీల‌త చెప్పింది.