ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 5 రోజుల్లో ఏకంగా రూ.38 కోట్ల భారీ కలెక్షన్స్ వసూలు చేసిందంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. మొదట సినిమాకి ఇంత బో.. ల్డ్ సీన్లలో నటించడానికి వైష్ణవి ఎలా ? ఒప్పుకుంది అనే విషయంపై ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవి ఈ సినిమాలో నటించడానికి ఒక అగ్రిమెంట్ కారణంగానే సైన్ చేసిందట.
దర్శకుడు సాయి రాజేష్ – వైష్ణవి చైతన్య వద్దకు వెళ్లి కథ వివరించగా మొదట ఇంత బో..ల్డ్ పాత్రలో నేను అసలు చేయనే చేయనని చెప్పేసిందట వైష్ణవి. అయినా కూడా ఒకటికి రెండుసార్లు ఆమె చుట్టూ తిరిగి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడట రాజేష్. కాగా వైష్ణవి కెరీర్ మొదట్లోనే ఇలాంటి బో..ల్డ్ పాత్రలో నటిస్తే నాకు నెగటివ్ హీరోయిన్ ఇంప్రెషన్ పడిపోతుంది. తర్వాత సినిమాల్లో అవకాశాలు రావు. అందుకే నేను ఈ సినిమాలో నటించను అని చెప్పేసిందట.
దీంతో సాయి రాజేష్ ఒకవేళ ఈ మూవీ చేసాక నువ్వు నెగిటివ్ హీరోయిన్గా టాక్ వస్తే నా తర్వాత వచ్చే మూడు సినిమాల్లో నువ్వే హీరోయిన్‌గా ఉంటావు అంటూ మాటఇచ్చి అగ్రిమెంట్ పై సైన్ చేయించుకున్నాడట. ఆ కారణంగానే వైష్ణవి ఈ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పి నటించిందట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.