ఎన్టీఆర్ ఆ ప‌ని చేసుండ‌క‌పోతే కృష్ణ ప‌రువు అంతా పోయేదా…. ఇది క‌దా స్నేహ‌మంటే…!

సూప‌ర్ స్టార్ కృష్ణ రెండు చేత‌లా సినిమాలు చేసే రోజులు అవి. ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంతోపాటు.. అనే క మంది దిగ్గ‌జ ద‌ర్శ‌కుల వ‌ద్ద‌కూడా.. రేయింబ‌వ‌ళ్లు సినిమాల్లో న‌టించారు. ఒకే సంవ‌త్స‌రం.. ప‌ది సిని మాలు విడుదలైన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. ఆయ‌న లెక్క‌లు ప‌క్కాగా చూసుకునేవారు కాదు. ఎందుకంటే.. ఒక్కొక్క సినిమాకు న‌ష్టం వ‌స్తే.. తిరిగి రెమ్యున‌రేష‌న్ ఇచ్చేసేవారు.

దీంతో హీరో కృష్ణ‌.. త‌న ఆదాయ వ్య‌యాల‌పై పెద్ద‌గా లెక్క పెట్టుకునేవారు కాదు. కానీ, ప్ర‌భుత్వానికి మాత్రం లెక్క‌లు చూపించాలి క‌దా! ఈ విష‌యాల‌ను ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌నిర్మల చూసుకునేవారు. అయితే.. ఒక ఏడాది ఇద్ద‌రూ బిజీ అయిపోయారు. అస‌లు.. ఈ లెక్క‌లు.. ఐటీ దాఖ‌లు వంటివి మ‌రిచిపోయారు. ఒక రోజు తెల్ల‌వారు జామునే.. కృష్ణ ఇంటికి ఐటీ అధికారులు వ‌చ్చేశారు. లెక్క‌లు చూపించాల‌ని గ‌ద్దించారు.

ఈ విష‌యాలను అప్ప‌టికే త‌న సోద‌రుడు ఆదిశేష‌గిరిరావు, విజ‌య నిర్మ‌ల చూస్తుండ‌డంతో త‌మ్ముడికి క‌బురు పెట్టి ర‌మ్మ‌న్నారు. ఆయ‌న వ‌చ్చే స‌రికే.. ఇల్లంతా సోధించిన అధికారులు ఏమీ ల‌భించ‌క పోవ‌డంతో డ‌బ్బులు.. ఎక్క‌డ దాచారో చెప్పాల‌ని ప్ర‌శ్నించార‌ట‌. ఇంత‌లో ఈ విష‌యం కాస్తా.. మీడియాకు చేరిపోయింది. దీంతో విష‌యం తెలిసిన అన్న‌గారు రామారావు.. త‌న అకౌంటెంట్ ను పంపించి.. ఐటీవారికి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

కృష్ణ పెట్టిన పెట్టుబ‌డులు.. ఇత‌ర‌త్రా విష‌యాలు నిజానికి ఎవ‌రికీ తెలియ‌దు. కానీ, ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కృష్ణ ఇచ్చిన 10 ల‌క్ష‌ల‌కు ఆయ‌న ర‌సీదు తీసుకోక‌పోవ‌డంతో.. అప్ప‌టికప్పుడు.. ర‌సీదును సిద్ధం చేయించి.. 80 సీ కింద‌.. దానిని తీసుకోవాల‌ని ఎన్టీఆర్ పంపించిన అకౌంటెంట్‌లు చెప్పారు. దీంతో ఆ దాడుల నుంచి కృష్ణ బ‌యట ప‌డ్డారు.

లేక‌పోతే ఆ రోజుల్లో కృష్ణ ఇంటిపై ఐటీ దాడులు అంటూ ఆయ‌న ప‌రువు అంతా పోయినట్ల‌య్యేది. సినిమా, రాజ‌కీయ రంగాల్లో వీరిద్ద‌రు ఎంత పోటీదారులు అయినా ఎన్టీఆర్ నిజ‌మైన స్నేహం అంటే ఏంటో ఈ టైంలో ఫ్రూవ్ చేశారు.