ఆ హీరోయిన్ అందం చూసి ఎన్టీఆర్‌కు పిచ్చెక్కిపోయి ఏం చేశారంటే… ఆ అంద‌గ‌త్తె ఎవ‌రంటే..!

సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో కొన్ని వందల సినిమాలలో నటించారు. ఆయన తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి పనిచేశారు. అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్లు అందరూ ఎన్టీఆర్ తో ఒక్క సినిమాలో కలిసి నటిస్తే చాలు తమ జన్మ ధన్యం అయిపోతుందని అనుకునేవారు. పాత‌త‌రంలో దేవిక‌, బి. స‌రోజా, భానుమ‌తి, సూర్య‌కాంతం, కేఆర్‌. విజ‌య‌, సావిత్రి, జ‌మున ఆ త‌ర్వాత త‌రంలో వాణిశ్రీ, శార‌ద‌, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద ఇలా చెప్పుకుంటూ పోతే ఎంద‌రో అంద‌గ‌త్తెల‌తో ఎన్టీఆర్ న‌టించారు.

ఎన్టీఆర్ ఎంతోమంది హీరోయిన్ల‌తో న‌టించినా ఇద్ద‌రు హీరోయిన్ల విష‌యంలో మాత్రం ఆయ‌న‌పై రూమ‌ర్లు వ‌చ్చాయ‌ని అంటారు. పాత‌త‌రం హీరోయిన్ల‌లో దేవిక ఎన్టీఆర్ తొలి ప్రియురాలు అంటారు. ఆ త‌ర్వాత కృష్ణ‌కుమారి – ఎన్టీఆర్ మ‌ధ్య కూడా ప్రేమాయ‌ణం న‌డిచింద‌ని అంటారు. అప్ప‌టికే ఎన్టీఆర్‌కు త‌న మ‌ర‌ద‌లు బ‌స‌వ‌తార‌కంతో పెళ్ల‌య్యింది.

అయితే అల‌నాటి గొప్ప హీరోయిన్ల‌లో ప్ర‌భ కూడా ఒక‌రు. ఆమె చంద్ర‌మోహ‌న్‌తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. చంద్ర‌మోహ‌న్ – ప్ర‌భ కాంబినేష‌న్ అంటే అప్ప‌టి సినీ ప్రేమికుల‌కు ఓ కిక్ ఉండేది. ఆ త‌ర్వాత ప్ర‌భ -రంగ‌నాథ్ కాంబినేష‌న్లో కూడా ఎన్నో హిట్ సినిమాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రి మ‌ధ్య కూడా కొంత కాలం ఆ.. బంధం న‌డిచింద‌ని అంటూ ఉంటారు.

అయితే ప్ర‌భ అందానికి ఎన్టీఆర్ అంత‌టి వాడే ముగ్ధుడు అయిపోయాడ‌ని అంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే త‌న సినిమాల్లో కూడా ఆయ‌న ఆఫ‌ర్లు ఇచ్చార‌ని కూడా ప్ర‌చారం ఉండేది. ఎన్టీఆర్ దాన‌వీర శూర‌క‌ర్ణ సినిమాలో చిత్రం భ‌ళారే విచిత్రం అని ఎన్టీఆర్ అన్న‌ప్పుడు ఆయ‌న చూపుల‌కు ధీటుగా ప్ర‌భ అద్భుత‌మైన అభిన‌యం ప‌లికింది. ఇప్ప‌ట‌కీ ఆ సాంగ్ చూస్తుంటే వీరిద్ద‌రి న‌ట‌న న‌భూతోః న‌భ‌విష్య‌త్ అనాల్సిందే.