సీనియ‌ర్ హీరోయిన్ రాధ సినిమా చేయాలంటే ఏ హీరో అయితే వెంటనే ఓకే చెప్పేదో తెలుసా..?

సీనియర్ నటి రాధ ఆ జనరేషన్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున..లాంటి వారందరి సరసన హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ముద్దుగా బొద్దుగా ఉండే రాధ మంచి నటి అనే కామెంట్స్ కూడా తెచ్చుకుంది. ఫ్యామిలీ రోల్స్ తో పాటుగా గ్లామర్ రోల్స్ కూడా చేసి ఒకదశలో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. దర్శకులకి నిర్మాతలకి అందుబాటులో ఉండే హీరోయిన్.

విజయశాంతి, సుహాసిని, సుమలత, భానుప్రియ, రాధిక లాంటి స్టార్ హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తూ క్రేత్‌తో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా రాధకి మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉండేది. ఆమె హీరోయిన్‌గా నటించిన దర్శకులందరితోనూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. నిర్మాతల దగ్గర రెమ్యునరేషన్ డిమాండ్ చేయని హీరోయిన్స్‌లో రాధ ముందు ఉంటారు.

ఏ సీన్ అయినా రాధకి కొట్టిన పింది. హీరోతో పోటీపడి సీన్స్ చేసినవి చాలా ఉన్నాయి. దర్శకుడు రాధ మీద ఎక్కువగా ఫోకస్ చేసి బ్యూటిఫుల్‌గా చూపించారు. అయితే, తన జనరేషన్‌లో నటించిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి అంటే రాధ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదట.

ఆమెకి కథ చెప్పిన దర్శకుడు ఇందులో హీరో చిరంజీవి అంటే ఏమాత్రం ఆలోచించకుండా డేట్స్ సర్దుబాటు చేసేదట.అప్పట్లో వారిద్దరి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ కూడా ఒక రేంజ్ లో ఉండేది మరి.