టాలీవుడ్ ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి అందరికి తెలిసిందే . ఈమె అసలు పేరు లలిత రాణి.. డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలుకని హీరోయిన్గా మారిన జయప్రద. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అచ్చ తెలుగు అమ్మాయిలాగ ఉన్న జయప్రద సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. తన అందం అభినయంతో పాటు తన నటనతో ఎందరో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
చిత్ర పరిశ్రమలో ఉన్న అందాల హీరోయిన్ల జాబితా తీస్తే అందులో జయప్రద పేరు కచ్చితంగా ఉంటుంది. 14 సంవత్సరాల వయసులో స్కూల్లో చిన్న డ్రామా చేస్తుండగా సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఈమెను చూసి యాక్టింగ్ ఫిదా అయిన ప్రభాకర్ రెడ్డి.. లలిత రాణిని జయప్రదగా మార్చి 1976లో భూమి కోసం సినిమాతో మూడు నిమిషాల నిడివి గల ఒక పాటతో చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే ఈ సినిమాకు గాను జయప్రద తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఎందుకంటే మొదటిసారి తెరపై కనిపించినందుకు జయప్రదకి ఇచ్చిన తొలి రెమ్యూనరేషన్ కేవలం పది రూపాయలు. అవును మీరు వింటున్నది నిజమే అలా పది రూపాయలతో మొదలైన జయప్రద సినీ ప్రయాణం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ అగ్ర హీరోలతో సమానంగా తన స్టార్డం తెచ్చుకోవడమే కాకుండా వారితో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చింది. అలా సౌత్ నార్త్ అనే భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేసింది. అలానే రాజకీయాల్లో కూడా జయప్రద తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉంది.