టైటిల్ చూసి హీరోయిన్ సంగీత విడాకులు తీసుకోవడం ఏంటి ? అని షాక్ అవుతున్నార. అది నిజమే కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు. గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సంగీత ఖడ్గం మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ ఎన్నో సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే 2009లో తమిళ్ నటుడు, సింగర్ క్రిష్‌ని వివాహం చేసుకున్న సంగీత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.
ఈ దంపతులకు 10 ఏళ్ల పాప కూడా ఉంది. పెళ్ళి తర్వాత సినీ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన సంగీత ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మసూద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి తర్వాత కొంతకాలానికే విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేసినట్టు కొన్ని షాకింగ్ విషయాలను తెలియజేసింది.
సంగీతది ప్రేమ వివాహం కావడంతో ఇరు కుటుంబాల వారు వారి ప్రేమను అంగీకరించలేదట. వారికి ఇష్టం లేకపోయినా సంగీత అతడిని వివాహం చేసుకుంది. దీంతో తన ఫ్యామిలీ నుంచి భర్త ఫ్యామిలీ నుంచి చాలా గొడవలు జరిగి ఒత్తిడికి లోనైనా సంగీత అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నాను.. తనతో కలిసి ఉండాలా? విడిపోవాలా? అనే ప్రశ్న మధ్య సతమతమైపోయేదట.
ఫైనల్ గా ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనుకున్నాము.. నేనంటే అతడికి చాలా ఇష్టం. నన్ను విడిచి ఉండలేడు.. నన్ను బాగా ప్రేమిస్తున్నాడు.. చాలా కమిట్మెంట్ ఉన్న పర్సన్. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అంటూ సంగీతం వివరించింది.