ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రాశి. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి ‘ పెళ్లి పందిరి ‘ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది. ప్రస్తుతం సీరియల్స్‌తో, పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తుంది. అలాగే పలు బ్యూటీ బిజినెస్‌లు ప్రారంభించి సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే రాశి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ డైరెక్టర్ చేసిన పని వల్లే నా కెరియర్ నాశనం అయిందని చెప్పుకొచ్చింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు తేజ. ఇతను రాశిని ‘ నిజం ‘ సినిమాలో విలన్ భర్త క్యారెక్టర్ లో రాశిని ఎంపిక చేశాడు. ఈ సినిమా ఆఫర్ గురించి రాశికి చెప్పినప్పటికీ అసలు క్యారెక్టర్ గురించి చెప్పలేదట. ఇక రాశి కూడా ఎలాంటి క్యారెక్టర్.. ఏంటి.. అనే విషయం తెలుసుకోకుండా సినిమాకి ఒకే చెప్పిందట.
మహేష్‌బాబు సినిమా కదా ? అని ఒక్కటే ఆమె చూసిందట. ఇక షూటింగ్ స్టార్ట్ అయినా తరువాత ఆ క్యారెక్టర్ గురించి తెలిసి రాశి చేయనని మొఖం మీద చెప్పేసిందంట. నువ్వు ఈ సమయంలో సినిమా చెయ్యనంటే మొత్తం ఆగిపోతుంది అని తేజ కన్విన్స్ చేశాడట. ఆ తర్వాత రాశి అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది.
టాప్ హీరోయిన్ గా ఉన్న రాశి అలాంటి క్యారెక్టర్ లో నటించడంతో అభిమానులు ఒప్పుకోలేక పోయారు.
ఆ తర్వాత ఆమె ఎన్ని పాత్రలు చేసినా అభిమానులను అలరించలేకపోయింది. ఇక రాశి ఆ క్యారెక్టర్ లో నటించాక ఆమెకు తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్స్ రాక ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయింది.