6 గురు హీరోయిన్ల‌తో త‌నికెళ్ల భ‌ర‌ణి ప్రేమాయ‌ణం … మామూలోడు కాదుగా…!

విల‌క్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న అతి కొద్దిమంది మహానటులలో తనికెళ్ల భరణి కూడా ఒకరు. కామెడీ అయినా, విల‌నిజం అయినా, సెంటిమెంట్ అయినా.. ఇలా ఏ యాంగిల్ లో అయినా తనదైన శైలిలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేసిన నటుడు ఆయన. తనికెళ్ల భరణి సినిమాల్లోకి రాకముందే ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించారు. ఆ తర్వాత నటుడుగా వచ్చిన‌ ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడుగా కొనసాగుతూనే వస్తున్నారు.

అంతేకాదు ఈయన దర్శకుడుగా మరి మిథునం లాంటి క్లాసిక్ సినిమాని కూడా తీశారు. మహాశివుడి భక్తుడుగా ఆయన ఎప్పుడు ఆ భగవంతుని నామస్మరణ లోనే ఉంటారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన యుక్త వయసులో చేసిన కొన్ని సంఘటనల గురించి.. అప్పుడు తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. యాంకర్ తనికెళ్ల భరణిని మీరు టీనేజ్ లో చాలా అందంగా ఉంటారు కదా ? మంచి పొడవు అయిన కటౌట్ కూడా ఉంది.. మీ వెంట అమ్మాయిలు పడలేదా ? అని అడిగాడు.

దానికి తనికెళ్ల భరణి ఆన్సర్ చెప్తూ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆరుగురు యంగ్‌ హీరోయిన్లు నన్ను ప్రేమించారు. నాతో మాట్లాడటానికి వాళ్ళ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకురావటమో.. లేదా ఏదో ఒకటి కొని నాకు ఇవ్వటమో చేసేవారు.. వాళ్ళ నుంచి లవ్ లెటర్లు కూడా వచ్చాయి. ఇప్పటికీ అవి నా దగ్గర భద్రంగా ఉన్నాయ‌ని తెలిపారు.

నా భార్య వాటిని చదువుతూ ఇంత అందమైన అమ్మాయిలు మీ వెంట పడ్డారు కదా ? మరి మీరు ఎందుకు నన్నే పెళ్లి చేసుకున్నారు అని అడిగేదని భరణి చెప్పుకొచ్చాడు. భరణి తనను ఆరుగురు హీరోయిన్లు ప్రేమించారన్న విషయం చెప్పినా.. ఆ హీరోయిన్ల పేర్లు మాత్రం చెప్పలేదు. ఇక తనికెళ్ల భరణి భార్య పేరు భవాని కావటం విశేషం.