ఈ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ఏం జరుగుతుందో తెలియడం లేదు.. కానీ స్టార్ సెలబ్రెటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు భాగస్వామికి విడాకులు ఇస్తూ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకే విడిపోతున్నారు. తాజాగా ఇదే లిస్టులోకి అందాల ముద్దుగుమ్మ జెనీలియా యాడ్ అయిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బొమ్మరిల్లు పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది జెనీలియా.
సిద్ధార్థ, జెనిలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. టాలీవుడ్లో ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా తర్వాత అవకాశాలు తగ్గడంతో మెల్లగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ సినిమాలో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్న జెనీలియా.. రితేష్ దేశ్ముక్ని ప్రేమించి వివాహం చేసుకుంది.
రితేష్ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు కావడంతో జెనీలియా పెళైన తర్వాత సినిమాలకు బై..బై చెప్పేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఇచ్చింది. ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ మళ్ళీ పాపులర్ అవుతోంది. ఈ నేపథ్యంలో జెనీలియా – రితేష్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
కానీ జెనీలియా తన భర్తతో దిగిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరి అన్యోన్యత చూసినవారంతా ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేస్తున్నారు. నిజానికి వీరిద్దరి మధ్య వార్ జరుగుతుందట.. వీరి మధ్య సఖ్యత లేదని త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. దానికి అసలు కారణం జెనీలియా ఈ గ్లామర్ ప్రపంచంలో వెండితెరతో పాటు బుల్లితెరపై మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకోవడమే అట.
రితీష్ కు అలాంటి పాత్రల్లో జెనీలియా నటించిన ఇష్టం లేదట. హోమ్లీగా మాత్రమే ఉండాలని.. మన ఫ్యామిలీకి మంచి చరిత్ర ఉందని.. ఆ పరిధి దాటి వెళ్లవద్దని చెప్పడంతో జెనీలియా తన ఆశలు వదులుకోవాలా ? అనే ఉద్దేశంతో తరచూ గొడవ పడుతుందట. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.