టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు తన కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు ఫ్రీ టైం దొరికిన ఫారెన్ టూర్లు వేస్తుంటారు. ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్న తాను అనుకున్న పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరీ ముఖ్యంగా కుటుంబంతో కలిసి వెళ్లే టూర్ల విషయంలో మహేష్ ఎంతో ప్రత్యేకంగా ఉంటారు తన కుటుంబానికి సంబంధించి మరీ ముఖ్యంగా తన కూతురు సితార గురించి చెప్పడానికి బాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే మహేష్ తన కూతురు సితారతో కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక సితార తన తండ్రి మహేష్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన తండ్రితో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ కి విషెస్ చెప్పింది. ఆ ఫోటోలకి “నాకు సూపర్ డాడ్ ” అంటూ మా నాన్నకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆ పోస్టులో రాసుకు వచ్చింది.
దీనితో ఈ పిక్స్ లో మహేష్ సితారలు తమ హ్యాపీ మూమెంట్స్ ని గడుపుతూ ఉండగా ఈ పిక్స్ చూసిన మహేష్ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. అది కూడా కాస్త బ్రేక్ ఇచ్చి.. తాజాగా టూర్ వెళ్ళి వచ్చాడు మహేష్. సినిమా షూటింగ్కు బ్రేక్ వచ్చిన పర్లేదు కాని.. తన ఫ్యామిలీ టూర్ మాత్రం మిస్ అవ్వడు మహేష్.