బిగ్‌బాస్ పెద్ద ఫేక్‌.. జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ను చేస్తుండ్రు… స‌ర‌యూ సంచ‌ల‌న నిజాలు…!

బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన ఎంతోమంది కంటెస్టెంట్స్ వారి అభిప్రాయాలను చెప్పారు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. షో ఎలా ఉంది అనేదానిపై ఒక్కొక్కరు ఒక్క విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల బిగ్ బాస్ షో లో కంటెంట్ గా పాల్గొన్న సరయు మాట్లాడుతూ బిగ్ బాస్ ఒక ఫేక్ షో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ విషయంపై స‌ర‌యు మాట్లాడుతూ ఈ రియాలిటీ షోలన్ని ఫేక్ అని.. మన వాళ్ళు గెలవడం కోసం ఇతరులను కొనుక్కోవడం లేదా వాళ్లకి డబ్బులు తిరిగి ఇవ్వడానికి రియాల్టీ షోలు మంచి ప్లాట్ ఫామ్‌ల‌ని సరయు కామెంట్ చేసింది. ఈ రియాల్టీ షో ద్వారా కంటెస్టెంట్లను, జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారని ఆమె చేప్పింది. దయచేసి ఇలాంటి రియాల్టీ షోలను చూడవద్దని మీ టైం వేస్ట్ త‌ప్ఫ యూజ్ ఏం ఉండ‌ద‌ని అభిప్రాయం వ్యక్తం చేసింది.

నేను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ గా చెప్తున్నాను.. బిగ్‌బాస్ షోకి వెళ్లిన టైంలో నాకేం తెలియదని.. జాబ్ చేయ‌డం, ఇంటికిరావ‌టం , యూట్యూబ్ వీడియోలు చేసుకోవ‌డం ఇది మాత్రమే నేను ఆలోచించేదాన్ని స‌ర‌యు వివ‌రించింది. బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లకి బయట నుంచి సపోర్ట్ లభించడంతో పాటు ఇంట్లో వాళ్ల దగ్గర నుంచి కూడా గట్టి సపోర్ట్ ఉంటుందని.. అలా సపోర్ట్ ఉన్నవారి కాన్ఫిడెన్స్ ఓ లెవెల్లో ఉంటుందని సరయు వివరించింది.

అలా స‌పోర్ట్ ఉన్న‌ వాళ్ళతో గొడవ పడడం చాలా కష్టమని.. వాళ్లతో పోరాడితే నెగిటివ్ అయ్యేది మనమేనని ఆ టైంలో నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని సరయు చెప్పుకొచ్చింది. ఇక సర‌యు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగు బిగ్‌బాస్ 7వ సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే.