పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నటీనటులు వారి వేషధారణ గురించి కాసేపు పక్కన పెడితే ..ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ మాత్రం ఎంతో ఛండాలంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ లో సగానికి సగభాగం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసమే వాడిన సరైన అవుట్ పుట్ ఇవ్వలేకపోయారు.
మరీ ముఖ్యంగా ఇటువంటి సినిమాలుకు గ్రాఫిక్స్ చాలా ముఖ్యం కానీ ఆదుపురుష్‌లో ఏవి హైలెట్ హైలెట్ అవుతాయని అనుకున్నారో అవే పెద్ద మైనస్ అయ్యాయి. చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఎటువంటి గ్రాఫిక్స్ లేని సమయంలోనే మన దర్శకులు ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎంతో అప్డేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. టెక్నికల్‌గా సినిమాల్లో జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి గ్రాఫిక్స్ సినిమాలు తెరకెక్కించడంలో టాలీవుడ్ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఎంతో సిద్ధహస్తుడు.
1995లోనే ఈయన డైరెక్షన్ లో వచ్చిన అమ్మోరు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఆ రోజుల్లో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ 1999లో కోడి రామకృష్ణ డైరెక్షన్ వచ్చిన దేవి సినిమా కూడా మరోసారి ఈయన ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసింది.ఎన్నో సినిమాలుకు ఆయన ఆరోజుల్లోనే ఇలాంటి టెక్నాలజీ లేకపోయినా అద్భుతమైన గ్రాఫిక్స్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ఈ ఆదిపురుష్ సినిమాపై ఎక్కువగా గ్రాఫిక్స్ విషయంలోనే బాగా నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ పై కూడా ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా కోడి రామకృష్ణ లాంటి దర్శకులను తలుచుకోకుండా ఉండలేం మన తెలుగు దిగ్గజ దర్శకులలో కోడి రామకృష్ణ కూడా ఒకరు. ఇది అది అని కాకుండా అన్ని జోనర్లలో 100కు పైగా సినిమాలు తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగు సినిమాల్లో అప్పటి తరంలో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆయన్ను మించిన వారు ఎవరు లేరని చెప్పలి.