ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సంయుక్త మీనన్. ఆమె ఇప్పటివరకు తెలుగులో నటించినది నాలుగు సినిమాలే అయినప్పటికీ ఆమె నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో ఆమెకు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు వరుసగా వస్తూన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్తమీనన్ రానాకు భార్యగా చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారాలో సంయుక్త మీనన్ కు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందా అందరికీ తెలుసు.. ఇందులో కూడా సంయుక్తమేనన్ హీరోయిన్ నటించింది.
దీని తర్వాత వచ్చిన విరూపాక్ష సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రీసెంట్గా సంయుక్త మీనన్ రెమ్యూనిరేషన్ కూడా బాగా పెంచేసింది. సంయుక్త మలయాళ హీరోయిన్ అయినా టాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సంయుక్త ఇప్పటివరకు సినిమాల ద్వారా చాలా ఆస్తులను కూడబెట్టుకుందట. సంయుక్త ఆస్తిల విలువ తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోవాల్సిందే.. !
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఇప్పటివరకు దాదాపు రు. 10 కోట్లకు పైగా ఆస్తిని కూడా పెట్టింది. వాటితోపాటు ఆమెకు సొంత ఊరైన పాలక్కాడ్ లో ఒక ఇల్లు.. కొచ్చీలో ఒక అందమైన విల్లాతో పాటు ఇటీవల కాలంలో హైదరాబాదులో కూడా ఒక అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు సంయుక్త దగ్గర 80 లక్షల విలువైన మెర్సండేస్ బెంజ్ కార్ కూడా ఉంది. అతి తక్కువ టైంలోనే ఆమె ఇన్ని ఆస్తులు కూడబెట్టుకుంది.