ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు బోల్డ్ పాత్రలు పోషిస్తూ దూసుకెళ్తోంది. అయితే తాజాగా సమంత గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లికి సిద్ధమయ్యిందట. గతంలో కూడా ఈ తరహా వార్తలు వచ్చాయి.
అయితే ఈసారి ఈ వార్తలు రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ఇందులో సామ్ ఒక వ్యక్తితో ఏకాంతంగా గడుపుతూ క్లోజ్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ తార ఆ లేటెస్ట్ పోస్ట్‌కు క్యాప్షన్‌గా “మూడ్” అని రాసి దాని పక్కన ఒక లవ్ సింబల్ కూడా యాడ్ చేసింది. ఫొటోలో సామ్ పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది.
అతడు హీరో అయితే అసలే కాదు. సినిమా పరిశ్రమకు కూడా చెందిన వాడు కాదని తెలుస్తోంది. సమంత సెర్బియాలో ఇతడితో కలిసి ఫొటో దిగినట్లు స్పష్టమవుతోంది. కాగా ఈ పిక్ చూసిన అభిమానులు అతను సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. సామ్ రెండో పెళ్లికి రెడీ అయినట్టు ఉందని ఇంకొందరు కామెంట్లు చేశారు.
మొత్తం మీద ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుందనే రూమర్స్ కి ఈ పిక్ ఆజ్యం పోసినట్లు అయ్యింది.
మరోవైపు సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ నిమిత్తం సెర్బియా వెళ్ళింది. ఆ ట్రిప్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.