ఇటీవల బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ అనే అభిమాని సమంత కోసం తన ఇంటి ప్రాంగణంలో గుడి కట్టిన విషయం తెలిసిందే. నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిని అంగరంగ వైభవంగా ప్రారంభించి సమంత విగ్రహానికి పాలతో అభిషేకం చేసి భారీ ఎత్తున కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది.
ఆ గుడి ఓపెనింగ్ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారుల చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించిందని ఆమెను ఎంతగా అభినందించడానికి మొదటి కారణం అదేనని సందీప్ పేర్కొన్నాడు. ఆమె సినిమా పరంగానే కాక వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అనే ఉద్దేశంతోనే ఆమెకు నేను అభిమానినయ్యానని సందీప్ చెప్పుకొచ్చాడు.
దాదాపు ఈ గుడి కట్టడానికి సందీప్ ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు చేశాడట. అయితే ఇదిలా ఉండగా సందీప్ ఆ గుడి కట్టడం కోసం ఆర్థిక ఇబ్బందులతో తన స్నేహితుల వద్ద కూడా కొంత డబ్బులు అప్పు చేసి మరి సమంత పుట్టినరోజు వేడుకలు.. గుడి ఓపెనింగ్.. చాలా ఘనంగా జరిపించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న చాలామంది నేటిజన్స్ సమంతపై అభిమానం ఉంటే ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని అనాథ చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నోళ్లకు సాయం చేయాలని సూచనలు చేస్తున్నారు.
అంతేకానీ సమంతకు గుడి కట్టడం ఏంటి ? వాడి పిచ్చి కాకపోతే.. అది కూడా ఆర్థిక సహాయం వేరే వారి నుంచి పొందిమరి చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా చాలామంది పేద పిల్లలకు హెల్ప్ చేశాడు అయితే ఆయనకు మరెందుకు గుడి కట్టలేదు… సమంతకు అంత స్పెషల్ ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు.