స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల బ్యాచ్‌లు రెండూ ఉంటాయి. ఆమెను టార్గెట్ చేసే అక్కినేని అభిమానులు, తెలుగు మీడియా అభిమానులు మాత్రమే కాదు.. ఇక్కడ, అటు కోలీవుడ్, బాలీవుడ్‌లో ఆమెను అభిమానించే వాళ్లు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటారు. ఇక సమంత యాంటీ గ్యాంగ్ అయితే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ? అని వెయిట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇక శాకుంతలం సినిమా ప్రమోషన్ల టైంలో చాలా బాధలో ఉన్నట్టు కనిపించిన సమంత.. ఆ వెంటనే ముంబైలో వాలిపోగానే చాలా ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. అసలు ఆమె రూపురేఖలే మారిపోయాయి. దీంతో జనాలు అవాక్కు అయిపోయారు. ఆమె హైదరాబాద్ వస్తేనే సెంటిమెంట్ డైలాగులు చెపుతుంది. అసలు ముంబై కాని.. లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం మాంచి జాలీమూడ్‌లో ఉంటుంది ? అని చర్చించుకుంటున్నారు.
నిన్నటికి నిన్న చేతిలో బాటిల్ పట్టుకుని మరీ విదేశాల్లో పార్టీ మూడ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. పైగా ఈ ఫొటోలు కూడా బయటకు వచ్చేలా చేసింది. సమంత చేతిలో బాటిల్ పట్టుకుని రచ్చ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న వీడియో చూసిన జనాలు అవాక్కయ్యారు. సమంతకు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే మయోసైటిస్, జ్వరం, అనారోగ్యం బాధలు ఉంటాయా ? అని నెటిజన్లు ఆమెను కామెంట్లు చేస్తూ ఆడుకుంటున్నారు.
యశోద సినిమా ప్రమోషన్లకు, అటు శాకుంతలం సినిమా ప్రమోషన్లకు ఆమె సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం చేసింది. మళ్లీ ఆమె ఖుషి సినిమా ప్రమోషన్ల వరకు కూడా హైదరాబాద్ రాకపోవచ్చు… ఖుషి టైంలో ఇక్కడకు రాగానే ఆమెకు మళ్లీ అనారోగ్యం కుంటి సాకులు, బాధలు వచ్చేస్తాయెమోనని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇంత అడ్డంగా దొరికేశాకా కూడా ఎందుకు డ్రామాలు.. అపేయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.