సమంతనే ఫాలో అవుతున్న విష్ణు ప్రియ.. అసలు ఈ స్టోరీ ఏంటి..!

బుల్లితెరపై యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ తరువాత ఫోక్ సాంగ్స్ చేస్తూ కుర్రాలని ఆకట్టుకుంటుంది. సీరియల్ యాక్టర్ మానస్ తో స్టెప్పులు వేసి పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై కూడా పలు రొమాంటిక్ పర్ఫామెన్స్ లతో ఈ జంట అదరగొడుతున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పొట్టి పొట్టి బట్టలతో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాలకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది విష్ణు. వెకేషన్ లు, ట్రిప్ లు అంటూ బీచ్ ల వెంట తిరిగే విష్ణు ప్రియ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టింది.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఆధ్యాత్మిక బాటపట్టి సినిమాలకు సెలవు ఇచి మరి దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు విష్ణు ప్రియ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తుంది. తాజాగా విష్ణు ప్రియ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు మోడరన్ వేర్ తో ట్రెండీ లుక్స్ లో కనిపించే విష్ణు ప్రియ సాంప్రదాయ బద్దంగా కనిపించడంతో జనం షాక్ అవుతున్నారు.

యూపీలో వారణాసికి వెళ్లిన విష్ణు ప్రియ మెడలో దండ వేసుకుని ఫోటో దిగింది.ఈ ఫోటో లో విష్ణు సమంతను గుర్తుకు తెచ్చింది. తాజాగా సమంత ఈషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో అచ్చం అలాగే మెడలో దండతో కనిపించడంతో సమంత, విష్ణు ప్రియ ఫొటోస్ పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇటీవల జెడి చక్రవర్తి మెయిన్ లీడ్ చేసిన దయా వెబ్ సిరీస్ లో కి రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం సమంత, విష్ణు ప్రియ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరిగే వీరికి సడన్గా ఏమైంది ఆధ్యాత్మిక బాట పట్టి ఇంత ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నారు అంటూ షాక్ అవుతున్నారు జనాలు..!!