మరోసారి ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఈసారి పుష్ప ని మించి ఉండబోతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే తెలుగు నుంచి బాలీవుడ్ వరకు వరుస‌ సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తన నటించిన సినిమాల్లో గ్లామర్ షోకే పరిమితం అయింది. కొన్ని సినిమాల్లో తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో మాత్రం తన అంద చందాలతో తన హాట్ డాన్స్ తో ప్రేక్షకులను మైమరిపించేసింది.. సమంత చేసిన ఉ అంటావా మామా పాట ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Samantha Charges Bomb For Pushpa Song!

ఈ సినిమాకి ఆ స్థాయిలో భారీ క్రేజ్ రావడానికి సమంత కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం సమంత తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తుంది. మరోవైపు హిందీలో సిటాటిల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. వీటితోపాటు ఓ హాలీవుడ్ సినిమా కూడా సమంత కమిట్ అయింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా ఇప్పుడు సమంత మరోసారి ఐటమ్ సాంగ్ కమిట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక తెలుగు సినిమా అని వార్త‌లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Here's what we know about a new version of Oo Anatava featuring in Pushpa 2 | Filmfare.com

ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలు వస్తున్న దేవరా సినిమాలో లేదా మరో స్టార్ హీరో సినిమాలో అయినా సమంత ఐటమ్ సాంగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సమంత చేయబోయే ఈ ఐటెం సాంగ్ పుష్ప సాంగ్‌ను మించి ఉండబోతుందట. ఇదే సమయంలో సమంత ఐటమ్ సాంగ్ గురించి ఎవరు తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.. బాలీవుడ్ స్థాయిలో భారీ సినిమాలు చేస్తున్న సమంత కూడా ఐటెం సాంగ్స్ చేసేందుకు ఆసక్తి చూపడానికి కారణం ఆ పాటలు ద్వారా కూడా భారీ క్రేజ్ రావడంతో పాటు రెమ్యూనిరేషన్ కూడా అధికంగా ఇస్తున్నారట. దీంతో సమంత వాటిలో ఎలా చేయటానికి అయిన‌ ఓకే చెప్పేస్తుందట..!!

NTR 30 is officially titled Devara; NTR looks marvelous in ...