ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారు సోషల్ మీడియాలో కూడా అంతే పాపులారిటీతో దూసుకుపోతున్నారు. ఇక ఇలా వీరిలో అందరికన్నా టాప్‌గా ఉన్న హీరోయిన్ సమంత. అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సమంత వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతోంది. మధ్యలో మాయోసైటీస్ కారణంగా కొంత సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా దూసుకుపోతోంది.
ఇక ప్రతి అప్‌డేట్ తన అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం ఈ స్టార్ బ్యూటీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో శరవేగంగా జరుగుతుంది. ఈ సమయంలోనే టర్కీ అందాలని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటోంది సమంత. తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫోటోలను షేర్ చేసింది.
టర్కీలో తాను ఎలా ? ఎంజాయ్ చేస్తుందో చెబుతూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో సమంత మరీ దిగజారి పోయి బాత్రూంలో దిగిన ఫోటోలు కూడా షేర్ చేయడం గమనార్హం. స్నానం చేసి టర్కీ టవల్ కొట్టుకుని ఉండటం, కారులో పడుకుని పుస్తకం చదువుతోంది.
అలాగే బాత్రూంలో హాట్ సెల్ఫీ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులకి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ హాట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాయి. ఈ ఫోటోలపై కొంతమంది మండి పడుతున్నారు. సమంత చివరకు బాత్ రూం అందాలు కూడా బయట పెట్టేందుకు వెనుకాడడం లేదని.. ఇంకొద్ది రోజులు పోతే ఇంకేం చూపిస్తుందో అని ఫైర్ అవుతున్నారు.