టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు మంచి కథలు ఎంచుకుంటూ.. మంచి కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా సామజవరగమన. శ్రీ విష్ణు హీరోగా, రెబా మోనికా జాన్ హీరోయిన్ గా, రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఈ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది.
ఈ సినిమా మూడు రోజుల ముందే ప్రీమియర్ షోలు వేయగా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే నిన్న నిఖిల్ స్పై సినిమాకు పోటీగా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు యునానమస్‌గా హిట్ టాక్ వచ్చింది. సామజవరగమన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.89 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. శ్రీ విష్ణు కెరీర్ లో తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ గా ఇవి రికార్డుల్లోకి ఎక్కాయి.
ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. అందుకు తగినట్లుగా థియేటర్ల లో ప్రేక్షకులను అలరించింది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ – హాస్య మూవీస్ పతాకాల పై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.