యంగ్ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా సామజవరగమన ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మూడు రోజుల ముందే కొన్ని పట్టణాల్లో ప్రీమియర్ షోలు వేశారు. సినిమాకు యునానమస్‌గా హిట్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు, టైటిల్ కు ఉన్న లింక్ ఏంటన్నది సస్పెన్స్ అంటున్నారు. ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక ఆసక్తికర విశేషం ఉంది. సాంస్క్రీట్ టచ్ కోసమే ఈ టైటిల్ పెట్టామంటున్నాడు హీరో శ్రీవిష్ణు.
గతంలో శ్రీ విష్ణు నటించిన “బ్రోచేవారెవరురా, రాజరాజచోర, అర్జున ఫల్గుణ.. సినిమాల్లో కొంచెం సంస్కృతం టచ్ ఉంటుంది… అయితే ఈ సారి సామజవరగమన సినిమాతో ఫస్ట్ టైం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాను.. అందరికీ తెలిసిన టైటిల్ అయితే బాగుంటుందని ఈ టైటిల్ పేరు పరిశీలించామని చెప్పాడు.
ఇక సామజవరగమన అనే టైటిల్ శంకరాభరణం, టాప్ హీరో, అల వైకుంఠపురం సినిమాల్లోని పాటలతో బాగా పాపులర్ అయిందన్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు. పైగా ఈ టైటిల్‌కు పురాణాలకు లింక్ ఉందని.. ఇంద్రుడు దగ్గరున్న ఐరావతం నడకని పోలుస్తూ సామజవరగమన అనే వర్ణించినట్టు ఉందని.. అలాగే శ్రీరాముడు కూడా అంతే సొగసుగా నడుస్తాడని వర్ణన ఉందని. ఇవన్నీ గుర్తు చేసేందుకే ఈ టైటిల్ పెట్టినట్టు శ్రీ విష్ణు వెల్లడించాడు.
అలా ఈ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని శ్రీ విష్ణు చెప్పాడు. ఇక ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో మూడు రోజుల ముందే వేసిన ప్రీమియర్లకు అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. సినిమాకు యునానమస్‌గా సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. హాస్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను అనీల్ సుంకర సమర్పిస్తుండగా… రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.