టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అయితే వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులను ఆకర్షిస్తారు. ఇంకా చెప్పాలి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టే హీరోయిన్లు మాత్రమే పదేళ్లకు పైగా కెరీర్ కొనసాగిస్తారు. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రారంభంలో సక్సెస్ దక్కుతుంది. అలా ఇప్పుడు శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాలో నటించిన రెబా మౌనిక జాన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.
నిఖిల్ స్పై సినిమాకు పోటీగా రిలీజ్ అయిన సామజవరగమన సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన రెబాకు ఇప్పుడు తెలుగులో పలువురు కుర్ర హీరోలు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలలో నటించిన ఓ హీరోయిన్ కు రెబా అక్క అవుతుందన్న చర్చలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
పైగా ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించింది. మరి ఆమె ఎవరనుకుంటున్నారా ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. రెబా మౌనిక బెంగళూరులోని ఒక మలయాళ కుటుంబంలో జన్మించింది. మాస్టర్స్ లో డిగ్రీ చేసిన ఆమె చదువుతున్నప్పుడే మోడలింగ్ చేయడంతో పాటు పలు వ్యాపార ప్రకటనలలోను నటించింది. 2016లో మలయాళంలో నవీన్ పౌలి హీరోగా నటించిన సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.
తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఆమెకు నాలుగేళ్ల పాటు తమిళ సినిమాలలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. గత ఏడాది జీమోన్ జోసెఫ్ అనే వ్యక్తిని రెబా పెళ్లి చేసుకుంది. ఆమె సూపర్ స్టార్ విజయ్ నటించిన విజిల్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైన కూడా పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్బాల్ మ్యాచ్లో జట్టును గెలిపించే రోల్లో కనిపించింది రెబానే కావటం విశేషం. ఇక ఇటీవల ఓటిటిలో రిలీజ్ అయిన భూ సినిమాలను హీరోయిన్గా చేసింది.
ఇక సామజ వర్గమున సినిమాలో ఆమె క్యూట్ నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా హీరోయిన్ అను ఇమ్మానుయేల్ రెబాకు వరుసకు అక్క అవుతుందని కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరికీ ఎలాంటి బంధుత్వం లేదు. ఈ విషయాన్ని రెబా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
అయితే 2016 లో ఇద్దరు కలిసి ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని.. అప్పటినుంచి తాను అనూ ఎమ్మాన్యుయేల్‌కు అక్కను అవుతున్నానంటూ ఎంతోమంది వార్తలు రాస్తున్నారని.. ఆ వార్తల ప్రభావంతో గూగుల్, వీకీపీడియా అలాగే చూపిస్తున్నాయని.. అంతకుమించి తమ ఇద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదని చెప్పింది.