‘ స‌లార్ ‘ టీజ‌ర్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కే ఎందుకు న‌చ్చ‌లేదంటే… ప్ర‌శాంత్ నీల్ బ్లండ‌ర్‌..!

బహుశా తొలిసారి కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు అందరూ అలారం పెట్టుకుని మరి నిద్ర లేచేలా చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ప్రభాస్తో తాను తెరకెక్కిస్తున్న సలార్ సినిమా టీజర్ ఎర్లీ అవర్స్ లో రిలీజ్ చేసి పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. ఇలా జరగటం ఇదే తొలిసారి. అయితే ఈ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.

ఏది ఏమైనా ఫ్యాన్స్ బయటకు చెప్పలేకపోతున్నారు కానీ టీజర్ మాత్రం కాస్తంత అసంతృప్తినే మిగిల్చింది. అయితే దీనిని టీజర్ అనకుండా ఈ వీడియో సలార్ రెండు భాగాలుగా అనౌన్స్మెంట్.. లేదా సలార్ ఏ రేంజ్ లో ఉందో ? సలార్ సినిమా స్టామినా ఏంటో చెప్పే గ్లిమ్స్ అని పేరు పెట్టి ఉంటే బాగుండేది. మొత్తం 1.46 నిమషాల టీజర్ లో చివరి ఇరవై సెకెండ్లు ఎండ్ టైటిల్స్ హడావుడికే సరిపోయినట్లైంది.

ఇక 1.12 నుంచి 1.20 వరకు అంటే ఎనిమిది సెకెండ్ల పాటు మాత్ర‌మే ప్రభాస్ ను చూపించారు. అది కూడా ఫేస్ పూర్తిగా చూపించ లేదు. అటు ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు కూడా లేవు. కానీ ఇచ్చిన బిల్డప్, చూపించిన సీన్లు, కనిపించిన సెటప్ అంతా మాత్రం మ‌రో కేజీయ‌ఫ్ 2 సినిమాను చూడ‌బోతున్నాం అన్న ఫీల్ క‌లిగించింది. ఈ టీజ‌ర్‌లో శాటిస్‌పై అయ్యేది దీనికి మాత్ర‌మే.

ప్ర‌శాంత్ నీల్ చేసిన మిస్టేక్ ఏంటంటే క‌థ దాచేసి ఎలివేష‌న్‌తో టీజ‌ర్ క‌ట్ చేసి ప‌డేశాడు. ఒక్క‌టి మాత్రం నిజం. ఈ సినిమాకు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న హంగామా చూస్తుంటే ఖ‌చ్చితంగా క‌నివినీ ఎరుగ‌ని రేంజ్ ఓపెనింగ్స్ ప‌డ‌డం ఖాయంగా ఉంది. సెప్టెంబ‌ర్ 28న స‌లార్ పార్ట్ 1రిలీజ్ అవుతోంది.